సుశాంత్ సింగ్ ఆత్మహత్య బాలీవుడ్ ని కుదిపేస్తోంది.

August 05, 2020

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. అతని వయసు ఎంతో తెలుసా? 34 సంవత్సరాలు. ఇంకా యువకుడు. పోనీ అవకాశాలు ఏమైనా లేవా అంటే.... లాక్ డౌన్ కాబట్టి అందరిలాగే ఇంటికి పరిమితం అయ్యాడు. అతనికి సాధారణంగా మంచి అవకాశాలు వచ్చాయి.

ఎంఎస్ ధోనీ బయోపిక్ ధోని పాత్ర పోషించింది సుశాంతే. మంచి నటుడు. ఎంతో భవిష్యత్తు ఉన్నవాడు. కానీ ఎందుకో 6 నెలలుగా డిప్రెషన్లో ఉన్నాడట. ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు. రెండు మూడు రోజుల క్రితమే అతను మిత్రులతో కలిసి పార్టీ చేసుకున్నాడు.

ముంబైలోని బాంద్రాలో అతని నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ లెటర్ కూడా ఏమీ లభ్యం కాలేదు. సుసైడ్ నోట్ కూడా ఏమీ రాయలేదు. ప్రస్తుతం ఇతర కారణాల కోసం పోస్టు మార్టం చేస్తున్నారు.

సరిగ్గా 6 రోజుల క్రితం సుశాంత్ సింగ్ మేనేజర్ దిశ సలియన్ ఆత్మహత్య చేసుకుంది. దానికి కూడా కారణాలు తెలియలేదు. ఇపుడు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ రెండు ఘటనలకు ఏదైనా లింకు ఉందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చాలామంది బాలీవుడ్ ప్రముఖులు ఆత్మహత్యను నమ్మలేకపోతున్నారు. అతనికి నేనంటే చాలా ఇష్టం. నాకూ అతనెంతో ఇష్టం. నేను చాలా మిస్సవుతున్నాను. ఇది అత్యంత విషాదం. షాకింగ్... అని సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు స్పందించారు. 

ప్రధాని మోడీ దీనిపై వేదనతో నివాళులు అర్పిస్తు ఈ ట్వీట్ వేశారు.

Sushant Singh Rajput...a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.