సుష్మా ప్రేమకథ: కాలేజీలో ప్రేమ.....ఎమర్జెన్సీలో పెళ్లి....

August 08, 2020

మొన్నటికి మొన్న కాంగ్రెస్ దిగ్గజాలు జైపాల్ రెడ్డి, షీలా దీక్షిత్ కనుమూసిన విషయం తెలిసిందే. ఇక వారి మరణవార్తలని మరవకముందే దేశం మరో దిగ్గజ నేతని కోల్పోయింది. బీజేపీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్...నిన్న అర్ధరాత్రి సమయంలో గుండెపోటుతో కన్నుమూశారు. సుష్మా మరణవార్త కేవలం బీజేపీ నాయకులనే కాకుండా..దేశంలోని ఆమె అభిమానులని తీవ్రంగా కలచివేసింది.

ఇక ఎమ్మెల్యేగా, ఢిల్లీ సీఎంగా, ఎంపీగా, ప్రతిపక్ష నాయకురాలుగా, కేంద్ర మంత్రిగా.....ఇలా ఏ పదవిలో ఉన్న....ఆ పదవికి వన్నె తెచ్చిన నాయకురాలు సుష్మా. మంచి వక్త, మానవతవాది అయిన సుష్మాని కోల్పోవడం దేశానికి పెద్ద లోటు అనే చెప్పాలి. సుష్మా మరణంతో అందరూ...ఆమె పాత జ్ఞాపకాలని గుర్తుతెచ్చుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ఈ సందర్భంగా సుష్మా ప్రేమకథ అందరినీ ఆకట్టుకుంటుంది. గతంలో క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుని తన భర్తతో ఎక్కువ సమయం కేటాయించాలనుందని సుష్మా ఓ సందర్భంలో చెప్పారు.

ఆ సమయంలోనే సుష్మా-స్వరాజ్ కౌశల్‌ల ప్రేమకథ బయటకొచ్చింది. కాలేజీలో మొదలైన ఆమె ప్రేమ కథ దేశంలో ఇందిరాగాంధి విధించిన ఎమర్జన్సీలో జరిగిన పెళ్లి వరకు సాగింది. 1970లలో సుష్మా ఢిల్లీలో న్యాయశాస్త్రం చదివేటప్పుడు స్వరాజ్ కౌశల్ అనే వ్యక్తి స్నేహితుడిగా పరిచమయ్యారు. అయితే పోను పోను వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరిదీ వేరు వేరు భావజాలాలు అయినప్పటికి వీరి మనసులు కలిశాయి. సుష్మాది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలం కాగా, కౌశల్ ది సోషలిస్ట్ భావజాలం. ఇక అలా అలా వీరు చదువు పూర్తి చేసి న్యాయవాది వృత్తి చేపట్టారు. తర్వాత వీరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లింది.

అయితే అన్నీ కుటుంబాలు లాగే వీరి పెళ్ళికి ఇంట్లో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో చేసేదేమీ లేక వీరు బయటకెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి ఇందిరాగాంధి ఎమర్జన్సీ విధించిన 1975లో జరిగింది. జూలై 13న సుష్మా కాస్తా సుష్మా స్వరాజ్ గా మారారు. ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు జార్జి ఫెర్నాండెజ్ కేసును టేకప్ చేసిన లాయర్ల బృందంలో సుష్మా-స్వరాజ్ కౌశల్‌ కూడా ఉన్నారు. మొత్తానికి ఆ విధంగా సుష్మా తన లవ్ స్టోరీని సక్సెస్ చేసుకుని...లైఫ్ లో ఉన్నత స్థాయికి ఎదిగారు. వీరికి బన్సూరి స్వరాజ్ అనే అమ్మాయి ఉంది. ఆమె కూడా న్యాయవాది వృత్తి చేపట్టారు. ఇక చివరిగా జూలై13న సుష్మా స్వరాజ్ తన భర్తతో కలిసి 44వ వివాహ వేడుకలని జరుపుకున్నారు.