ఆ హీరోయిన్ అడ్డంగా దొరికేసింది

August 07, 2020

బాలీవుడ్లో మేధావి వ‌ర్గంలో ఒక‌రిగా గుర్తింపు పొంద‌డానికి.. లిబ‌ర‌ల్ ముద్ర వేయించుకోవ‌డానికి త‌పించే బ్యాచ్ ఒక‌టుంది. ఆ బ్యాచ్‌కు కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ స‌ర్కారు అంటే అస్స‌లు గిట్ట‌దు. ఏం చేసినా వ్య‌తిరేకిస్తుంటుంది. సిటిజ‌న్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేష‌న‌ల్ రిజిస్ట‌ర్ ఆఫ్ సిటిజ‌న్స్ (ఎన్ఆర్సీ)ల‌ను ఈ బ్యాచ్ తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ స్టాండ్‌తో గ‌ట్టిగా గ‌ళం వినిపిస్తున్న వాళ్ల‌లో స్వ‌ర భాస్క‌ర్ ఒక‌రు. త‌ర‌చుగా ఆమె మోడీ స‌ర్కారును విమ‌ర్శిస్తుంటుంది. టీవీ చ‌ర్చ‌ల్లో పాల్గొంటూ ఉంటుంది. జేఎన్‌యూ పూర్వ విద్యార్థి అయిన స్వ‌ర‌.. అక్క‌డి విద్యార్థులు ఏం చేసినా స‌పోర్ట్ చేస్తుంటుంది.
తాజాగా ఆమె సీఏఏ, ఎన్ార్సీ మీద ఓ టీవీ ఛానెల్ నిర్వ‌హించిన చ‌ర్చ‌లో పాల్గొంది. అక్క‌డ వీటికి వ్య‌తిరేకంగా గ‌ళం విప్పింది. మోడీ స‌ర్కారు తీరును దుయ్య‌బ‌ట్టింది. ఐతే 2010లో యూపీఏ స‌ర్కారు ఉండ‌గా ఇదే త‌ర‌హాలో చేప‌ట్టిన నేష‌న‌ల్ పాపులేష‌న్ రిజిస్ట‌ర్ (ఎన్‌పీఆర్‌)ను ఎందుకు వ్య‌తిరేకించ‌లేదంటూ న్యూస్ ప్రెజెంట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. స‌మాధానం దాట‌వేసే ప్ర‌య‌త్నం చేసింది. అప్ప‌టికి త‌న వ‌య‌సు 15 ఏళ్లే అంటూ క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేసింది. కానీ ప్ర‌స్తుతం స్వర వ‌య‌సు 31 ఏళ్లు. దీని ప్ర‌కారం 2010లో ఆమె వ‌య‌సు 21 ఏళ్లు. ఇక్క‌డ అడ్డంగా దొరికేసిన స్వ‌ర‌ను సోష‌ల్ మీడియా జ‌నాలు ఒక ఆట ఆడేసుకుంటున్నారు. మ్యాథ‌మెటీషియ‌న్ స్వ‌ర అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె మీద పెద్ద ఎత్తున మీమ్స్ త‌యారు చేస్తున్నారు.