​నరేంద్రుడికి నచ్చని మాట అనేసిన నందేంద్ర

August 10, 2020

నరేంద్రమోడీ.. అలెగ్జాండర్ రూట్లో నడుస్తున్న ​సామ్రాజ్యాధినేత. తనకు మిత్రులు శాశ్వతంగా ఉండరు. ఆయనే ఉంచుకోరు. ఏ రాష్ట్రంలో అయినా నరేంద్రమోడీ ఎవరితో అయినా స్నేహం చేస్తే అది ఇంకొకరిమీద పై చేయి సాధించడానికేగాని ఒకరిమీద ప్రేమతో కాదనే విషయం ఇప్పటికే స్పస్టమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వరకు కేసీఆర్ తో మోడీ సఖ్యతగా ఉన్నారు. దీనికి కారణం కేసీఆర్ అంటే మోడీకి ఇష్టం అని కాదు, కాంగ్రెస్ ను దెబ్బకొట్టడానికి మోడీ వేసిన ప్లాన్లో కేసీఆర్ లబ్ధి పొందాడు అంతే. కాంగ్రెస్ ను తెలంగాణలో ఖతం చేయాలనే మోడీ లక్ష్యం నెరవేరింది ఇక కేసీఆర్ ను వదిలేశాడు. 2024లో తెలంగాణలో బీజేపీ గవర్నమెంటు రావడం ఖాయం.
అయితే, ఏ రాష్ట్రంలోనూ లేనట్లు ఇక్కడి ప్రజలు కూడా 2024 తర్వాత ప్రభుత్వాన్ని దించేయడానికి సిద్ధమైపోయారు. దీనికి ఉదాహరణ ఎంపీ ఎన్నికలు. కేసీఆర్ దించడానికి ప్రజలు కూడా కాంగ్రెస్ స్థానంలో మోడీని వాడదామనుకోవడం బీజేపీకి కలిసొస్తోంది. అంటే బీజేపీకి పడే ప్రతి ఓటు కేసీఆర్ పై కోపంతోనే అని చెప్పొచ్చు. మోడీ ఏమో ఇలా ఫిక్సయితే మోడీ ప్లాన్ కు విరుద్ధంగా ‘‘ఏపీ షాడో సీఎం’’లా వ్యవహరిస్తున్న ఆధ్యాత్మిక వేత్త స్వరూపానంద స్వామి మోడీకి చెవులకు నచ్చని మాట చెప్పాడు. 15 ఏళ్లు కేసీఆర్ సీఎంగా ఉండాలని దీవించాడు.
ఈ మాటతో స్వరూపానంద మోడీ కంట్లో పడ్డారు. ఇక సమీప భవిష్యత్తులో ఆ వేడి ఏంటో స్వరూపానందకు తగలకతప్పదు. మరోవైపు ఏపీలో జగన్ ని కూడా దీవించాడాయన. అక్కడ బీజేపీ టార్గెట్ 2029. కానీ 2039 వరకు జగనే సీఎంగా ఉండాలని స్వరూపానంద ఆకాంక్షిస్తున్నారు. అంటే తెలుగు రాష్ట్రాల్లో మోడీ ఎంట్రీని స్వరూపానంద తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విశాఖ స్వాములు. దీనిని బీజేపీ అంత లైట్ గా తీసుకోదు.