దిశా కోసం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న ఢిల్లీ మ‌హిళ‌

May 30, 2020

హైదరాబాద్‌లో జ‌రిగిన `దిశ‌` ఘటనతో దేశంలోని మ‌హిళ‌లు భయకంపితులు అవుతున్న సంగ‌తి తెలిసిందే. దేశ‌వ్యాప్తంగా ఆయా ప్రాంతాల్లో జ‌రుగుతున్న ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లే దీనికి నిద‌ర్శ‌నం. అయితే, ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌సర్సన్‌ స్వాతి మలివాల్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వారిపై ప్రభుత్వం నిర్దిష్ట చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...మంగళవారం ఉదయం 10 గంటలనుంచి జంతర్‌ మంతర్‌ వద్ద నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించారు. రేపిస్టులకు 6 నెలల లోపు మరణ శిక్ష విధించాలనేది స్వాతి మలివాల్‌ డిమాండ్ చేశారు.
కాగా,  ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌సర్సన్‌ స్వాతి మలివాల్  దిశా ఘ‌ట‌న‌లో ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఢిల్లీలోని సాంసద్‌మార్గ్‌లో నిర్వహించిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. దీంతోపాటుగా ఢిల్లీకి చెందిన అను దూబే (20) శనివారం పార్లమెంట్‌ సమీపంలోని ఓ దిమ్మెపై కూర్చొని ‘నా దేశంలో నేనెందుకు సురక్షితంగా ఉండలేకపోతున్నా’ అంటూ ఫ్లకార్డు ప్రదర్శించారు. దీంతో పోలీసులు ఆమెను బలవంతంగా పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం అనుదూబే మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తనతో ఢిల్లీ పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, ఇద్దరు పోలీసులు రక్తం వచ్చేలా కొట్టారని ఆరోపించారు. దేశంలో మహిళలకు రక్షణ కరువైందంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌ప‌ర్స‌న్ హోదాలో స్వాతి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డీసీపీకి ఆదేశాలు జారీ చేశారు. అను దూబేను కొట్టడం సిగ్గుమాలిన చర్య అని ఢిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు.
ఇలా మ‌హిళ‌ల విష‌యంలో త‌క్ష‌ణం స్పందించే స్వాతి ఇప్ప‌టికే ప‌లుసార్లు దీక్ష‌లు చేశారు. మైనర్లపై అత్యాచార కేసుల్లో నేరస్తులకు  మరణ శిక్ష వేయాలని గత ఏడాది ఏప్రిల్‌లో నిరాహార దీక్షను చేపట్టారు. తాజాగా మహిళలపై అత్యాచారాలకు తెగబడిన నేరస్థులకు మరణశిక్ష విధించాల్సిందేనని, కేంద్రం నుంచి ఖ‌చ్చితమైన హామీ లభించేంతవరకు దీక్ష విరమించబోన‌ని ప్ర‌క‌టిస్తూ..రేపు ఉద‌యం ఆందోళ‌న చేప‌ట్ట‌నున్నారు.  

Read Also

పార్లమెంటులో నవ్వులపాలయిన వైసీపీ ఎంపీ
చంద్రబాబు సరే, వైసీపీ ఎమ్మెల్యేలకైనా తెలుసా ఆ సంగతి?
జగన్‌ను ఇబ్బంది పెట్టేస్తున్న తెలంగాణ, కర్ణాటక