బాలకృష్ణ గురించి న.గ్నం అమ్మాయి మాటలు విన్నారా

August 05, 2020

స్వీటీ అలియాస్ శ్రీ రాపాక .... అదే నండీ ఇటీవల రామ్ గోపాల్ వర్మ తీసిన బూ-తు సినిమా హీరోయిన్ అల్లాటప్పా డీగ్రేడ్ అమ్మాయి కాదు. పెద్దపెద్ద హీరోలకు, హీరోయిన్లకు క్యాస్టూమ్ డిజైనర్ గా పనిచేసిన అమ్మాయి. తెలుగుమ్మాయే. పశ్చిమగోదావరి జిల్లా దేవరపల్లి ఆమె సొంతూరు. 

తన పాత సంగతులు చెప్పుకువచ్చే క్రమంలో పలు ఇండస్ట్రీ విషయాలు చెప్పింది. బాలకృష్ణ గురించి బయట ఎన్నో అపోహలు ఉంటాయి కదా. తాను కూడా బాలకృష్ణ సినిమాలకు కూడా పనిచేసిందట. అయితే, బాలకృష్ణ గురించి ఏమనుకుంటున్నారు అని అడిగితే ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది.

బాలకృష్ణ మహిళల పట్ల చాలా హుందాగా ఉంటారని చెప్పింది. చాలా మర్యాదస్తుడు అని... ఎవరి జోలికి పోరు అని చెప్పింది.

ఒకసారి స్వీటీ అలియాస్ శ్రీరాపాక బాలకృష్ణ ఇంటికి వెళ్లాల్సి వచ్చిందట. ఆయనకు కోపం, టెంపర్ ఎక్కువ ఏమవుతుందో ఏమో అని వెళ్లింది. ఆమె ఆలోచనలకు విరుద్దంగా బాలయ్య చాలా మర్యాదగా స్పందించారట. కూల్ గా ఉన్నారట. ఆమెతో గాని, ఆమెతో పాటు ఉన్న టీమ్ కు గాని గౌరవమర్యాదలతో వ్యవహరించాట. చిన్నిపిల్లలు ఉన్నంత స్వచ్ఛంగా ఉంటారు ఆయన అని చెప్పింది స్వీటీ.

ఆయనకు షార్ట్ టెంపర్ ఉన్నమాట నిజమే. క్షణాల్లో కోపం వస్తుంది. క్షణాల్లో తగ్గిపోతుంది. అది కొద్దిసేపే. ఆయన చాలామంచి వ్యక్తి అని శ్రీరాపాక వివరించారు. 

ఈమె మాత్రమే కాదు బాలయ్య గురించి అందరి అభిప్రాయం ఇదే. గతంలో ఇండియా టుడే పత్రికకు చిరంజీవి ఇంటర్వ్యూ ఇస్తూ... బాలయ్యది చిన్నపిల్లల్లా స్వచ్ఛమైన మనస్తత్వం ఏదీ మనసులో దాచుకోరు. తన తండ్రి సీఎం అయినపుడు గాని కానపుడు బాలకృష్ణలో మార్పులేదు. తనది నిలకడైన వ్యక్తిత్వం అని కొనియాడారు అప్పట్లో.