హీరో నాగార్జునపై దారుణమైన వ్యాఖ్యలు

May 31, 2020

శ్వేతారెడ్డి... ఆమె ఏ ఛానెల్లో యాంకరో ప్రపంచానికి పెద్దగా తెలియదు. జర్నలిస్టుగా ఎక్కడ చేశారో ఎవరికీ అంతుపట్టదు. యుట్యూబులో కుప్పలుతెప్పలుగా పుట్టుకొచ్చిన కొన్ని ఛానెళ్ల ద్వారా మాత్రం కొన్ని ఇంటర్వ్యూలు చేసింది. కానీ కేఏ పాల్ ఎపిసోడ్ తో ఆమె ఇంటర్నెట్ క్ పరిచయమైంది. మరి మరింత పాపులారిటీ కోసం తాపత్రయమో, బిగ్ బాస్ షోలో నిజంగానే తేడానో వాస్తవాలు ఆధారాలతో బయటపడలేదు. పోలీసులూ ఏమీ వెల్లడించలేదు. ఆ హోస్ట్ గా వ్యవహరిస్తున్నందుకు నాగార్జునను నానా మాటలు అనేసింది శ్వేతారెడ్డి. నాగార్జునను దొంగ అనేసింది. డబ్బు కక్కుర్తి వాడు అనేసింది. ఆయన ఇంట్లో ఆడోళ్ల దాకా వెళ్లింది. ఇంతవరకు ఓ స్థాయిలో ఉన్న శ్వేతారెడ్డి ఆరోపణలు ఈరోజు హద్దులు దాటాయి. 

హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మరోసారి మీడియా సమావేశం ఏర్పాటుచేసిన శ్వేతారెడ్డి... నాగార్జునపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘‘నాగార్జునకు సామాజిక బాధ్యత లేదు. నాగార్జున భార్య అమల జంతువుల సంరక్షణ కోసం స్పందిస్తుంటారు. బిగ్ బాస్ షోపై ఇంత మంది అమ్మాయిలు ఆరోపిస్తున్నా నాగార్జున స్పందించరు, అమల స్పందించరు. 'మన్మథుడు2' సినిమా ప్రమోషన్ కోసం ఆసక్తి చూపుతున్న నాగార్జున తమ ఆరోపణలపై స్పందించరు. దమ్ముంటే అమల, సమంతలను బిగ్ బాస్ షోకు పంపాలి. వారిని షోకు పంపి డబ్బులు సంపాదించుకోవాలి. నాగార్జున దొంగలా దాక్కున్నారు. తప్పు చేయకపోతే బయటకు వచ్చి స్పందించాలి. డబ్బుల కోసం ఏమైనా చేస్తావా నాగార్జునా?’’ అంటూ చెడా మడా తిట్టారు. 

ఈ సమావేశంలో ఆమె మాటలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ సమావేశంలో  ఆమె స్వయంగా ఓ మాట అన్నారు. ’’అన్నిటిపై స్పందిస్తున్న నాగార్జున తన ఆరోపణలపై స్పందించరు‘‘ ... ఆమే ఆరోపణలు అనే పదం వాడాక ఇక నాగార్జున స్పందించేది ఏముంటుంది? 

ఇంకో మాట కూడా అంది... ‘‘బిగ్ బాస్ షోకు మీ ఆడోళ్లు సమంత, అమలను పంపి డబ్బు సంపాదించుకో’’ అని. నాగార్జున బిగ్ బాస్ షో హెడ్ కాదు, కేవలం హోస్ట్ మాత్రమే. ఆమె ఆరోపణలు చేసింది బిగ్ బాస్ పైన. దానికి నాగార్జునను స్పందించమని అడగడం ఏంటో? 

ఆమె అన్న మరోమాట ‘‘టాస్క్ ల పేరిట బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లను మానసికంగా వేధిస్తున్నారు’’ అని. ఆ షోలో ప్రతి విషయం కంటెంస్టెంట్లకు చెప్పే చేస్తారు. పైగా ఇది మొదటి సీజన్ కాదు. ఇలాంటివి ఇప్పటికే తెలుగులో రెండు, ఇతర భాషల్లో అనేకం జరిగాయి...అవన్నీ చూశాకే వీరంతా దానికి వెళ్లారు అంటే ఇష్టపూర్వకంగానే వెళ్లారు.

లైంగిక ఆరోపణలు చేసిన శ్వేతారెడ్డి... దానిపై పోరాడకుండా... ఇతర అంశాల గురించి, సంబంధం లేని వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఇలా మీడియా సమావేశాలు పెట్టడంపై పలు విమర్శలు వస్తున్నాయి. దీనివల్ల ఆమె చేసిన ఆరోపణలపై కూడా అనుమానాలు కలిగే పరిస్థితి.