​స్విస్ కొండపై భారత పతాకం... ఎందుకు?

August 06, 2020

అవును స్విట్జర్లాండ్ ప్రతిష్టాత్మకంగా భావించే మాటర్ హార్న్ భారీ పర్వతం నిండా మన మువ్వన్నెల జెండా మెరిసింది. ఈ సమయంలో మన పతాకం ఎందుకు వాళ్ల పర్వతంపై వేశారు... అసలే ప్రపంచం కోవిడ్ తో నానా ఇబ్బంది పడుతుంటే అనుకుంటున్నారా? అందుకే వేశారు... కోవిడ్ పై పోరులో ఒకరికి ఒకరు నైతిక మద్దతు పలుకుదాం అని మన భారీ పతాకాన్ని విద్యుత్ రంగుల కాంతుల రూపంలో స్విట్జర్లాండ్ ఆవిష్కరించింది. 

జెమాత్ మ్యాటర్ హార్న్ అనే ఈ పర్వతంతో స్విస్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో ఒక ముఖ్యమైన పర్వతం. స్విస్ టూరిజంలో దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ కొండపై వెయ్యి మీటర్లు అంటే ఒక కిలోమీటరు పొడవైన భారత పతాకాన్ని ప్రదర్శించారు. మనతో పాటు స్విస్ తో సంబంధాలున్న ఇతర ప్రముఖ దేశాలవి కూడా ప్రదర్శించారు. వాటిలో ఇంగ్లండ్ అమెరికా కూడా ఉన్నాయి. స్విస్ చూపిన ఈ పాజిటివ్ సైన్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇది ఇపుడు ట్విట్టరులో ట్రెండవుతోంది.