‘సైరా’లో పది గూస్ బంప్స్ సీన్స్

February 22, 2020

‘సాహో’ సంగతి తేలిపోయింది. ఇక తెలుగు ప్రేక్షకుల దృష్టి మొత్తం ‘సైరా నరసింహారెడ్డి’ మీదే కేంద్రీకృతం అయి ఉంది. ఈ సినిమా అయినా అంచనాలకు తగ్గట్లు ఉంటుందా.. చిరు-చరణ్-సురేందర్ కలిసి చేసిన ఈ సాహసోపేత సినిమా ప్రేక్షకుల్ని అలరిస్తుందా.. తెలుగుతో పాటు మిగతా భాషల్లోనూ అనుకున్న ఫలితం రాబడుతుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఐతే ప్రేక్షకుల అంచనాలకు ఈ సినిమా ఏమాత్రం తగ్గదని ధీమా వ్యక్తం చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. కొన్ని రోజుల కిందాటే రషెస్ చూసిన చిరు.. ఔట్ పుట్ పట్ల పూర్తి సంతృప్తి చెందారని.. తనను ఆనందంతో కౌగిలించుకున్నారని సురేందర్ చెప్పాడు. అల్లు అరవింద్ సైతం సినిమా బాగా వచ్చిందని మెచ్చుకున్నారని.. ఫలితం గురించి ఏమీ ఆలోచించకుండా ప్రశాంతంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చూసుకోమనన్నారని సురేందర్ తెలిపాడు.

‘సైరా’ సినిమా చిరు అభిమానుల్ని నూటికి నూరుశాతం సంతృప్తి పరుస్తుందని సురేందర్ చెప్పాడు. అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులకు సైతం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే పది ఎపిసోడ్లు ‘సైరా’లో ఉన్నట్లు చెప్పి సినిమాపై అంచనాలు పెంచేశాడు సూరి. ‘సైరా’ సినిమా ఇంత బాగా వచ్చిందంటే..అందుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథలో ఉన్న గొప్పదనమే కారణమని.. వింటేనే గూస్ బంప్స్ వచ్చే ఉదంతాలు ఆయన జీవితంలో ఉన్నాయని.. సినిమాలో చిరు ఇంకా బాగా వాటిని పండించారని సురేందర్ తెలిపాడు. ‘సైరా’ టీజర్ చూసినపుడే జనాల్లో అంచనాలు పెరిగాయని.. ట్రైలర్ చూశాక మరింతగా ఎగ్జైట్ అవుతారని.. కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని అందుకునేలా ఉంటుందని సురేందర్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ నెల 15న కర్నూలు వేదికగా జరిగే ఆడియో వేడుకలో ‘సైరా’ ట్రైలర్ లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబరు 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read Also

హామీలిచ్చేటప్పుడు కండీషన్లు చెప్పరేం జగన్
బిల్లు బకాయిలపై సంచలన నిజాన్ని చెప్పిన కేసీఆర్
ఇక నుంచి మంచోళ్లకి కార్ ఇన్సూరెన్స్ తక్కువ రేటట!