భారీగా సాగిన సైరా బిజినెస్.. పిగర్స్ ఇవేనట

February 16, 2020

రాజకీయాల నుంచి సినిమాల్లోకి వచ్చేసి.. తన రీఎంట్రీ మూవీ ఖైదీ నెంబరు 150తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్.. తన కలల ప్రాజెక్టు అయిన సైరాతో అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు సంబంధించిన పాజిటివ్ టాక్ నడుస్తోంది. ఇది.. ఈ సినిమా బిజినెస్ ను భారీగా చేసేలా చేసింది.
సైరా విషయంలో చిరంజీవి ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని.. గడిచిన ఆర్నెల్లుగా ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవటమేకాదు.. గ్రాఫిక్స్ విషయంలో చిరునే స్వయంగా మానిటర్ చేశారన్న మాట ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. భావోద్వేగాన్ని తట్టిలేపే సీన్లు బోలెడన్ని ఈ సినిమాలో ఉన్నాయని.. సినిమా విజయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.
రామ్ చరణ్ నిర్మించిన ఈ చిత్రాన్ని స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశం ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ అదిరిపోయేలా సాగిందంటున్నారు. ప్రాంతాల వారీగా బిజినెస్ తో పాటు డిజిటల్.. శాటిలైట్ హక్కుల రూపంలోనూ భారీ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రాంతాల వారీగా హక్కుల అమ్మకాలే రూ.300 కోట్లు దాటిపోయాయి. ఇక.. డిజిటల్.. శాటిలైట్ బిజినెస్ కూడా భారీగానే క్లోజ్ అయినట్లుగా చెబుతున్నారు. అయితే.. వాటికి సంబంధించిన డిటైల్స్ మాత్రం బయటకు రాలేదు.
ప్రాంతాల వారీగా క్లోజ్ అయిన బిజినెస్ ఫిగర్స్ విషయానికి వస్తే..
% నైజాం(తెలంగాణ) రూ.34 కోట్లు
% సీడెడ్ (రాయలసీమ) రూ.21 కోట్లు
% వైజాగ్ రూ. 14.5 కోట్లు
% ఈస్ట్ రూ.10.4 కోట్లు
% వెస్ట్ రూ.9.2 కోట్లు
% కృష్ణ రూ. 9.6 కోట్లు
% గుంటూరు రూ.11.50 కోట్లు
% నెల్లూరు రూ.5.2 కోట్లు
% కర్ణాటక రూ.27 కోట్లు
% తమిళనాడు రూ.7.6 కోట్లు
% కేరళ రూ.2.5 కోట్లు
% హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.27.5 కోట్లు
% ఓవర్సీస్ రూ.20 కోట్లు