ఫస్ట్ పబ్లిక్ టాక్ : సైరా ఎలా ఉందంటే ?

February 20, 2020

అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్న సైరా నరసింహారెడ్డి తెలుగు తెరపైకి వచ్చేసింది. ముంబయి నుంచి ఒక క్రిటిక్ సైరా మూవీ మీద ఒక చిన్నపాటి రివ్యూను పోస్ట్ చేశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది. ఇప్పటికే దుబాయ్ కు చెందిన ప్రవాస భారతీయుడు కమ్ అక్కడి సెన్సార్ సభ్యుడు సినిమాకు ఫోర్ స్టార్ రేటింగ్ ఇవ్వటమే కాదు.. సైరాను పొగడ్తలతో ముంచెత్తిన వైనం తెలిసిందే.
దీనికి తగ్గట్లే..తాజా పోస్టులోనూ సినిమా గురించి పాజిటివ్ గా  చెప్పుకొచ్చారు. మెగా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం.. వారి అంచనాలకు ఏ మాత్రం తగ్గదంటున్నారు. చిరు అభిమానులు ఎలాంటి చిత్రాన్ని ఆయన నుంచి ఆశిస్తారో.. ఆ స్థాయికి ఏ మాత్రం తగ్గని రీతిలో సినిమా ఉందని చెబుతున్నారు.  మెగా అభిమానులు పండుగ చేసుకునేలా తొలి రివ్యూ ఉంది.
సదరు క్రిటిక్ ఇచ్చిన సమాచారం ప్రకారం.. తాను సినిమా చూశానని.. అద్భుతంగా ఉందంటూ పోస్ట్ చేశారు. ముఖ్యంగా చిరు నటన మరో స్థాయిలో ఉందని.. మొదటి భాగమంతా విజువల్ వండర్ గా ఉందన్నారు. సినిమాకు సంబంధించి ఆయన పేర్కొన్న ముఖ్యంశాల్ని చూస్తే..

* సినిమా స్టార్టింగ్ లోనే పవన్ కల్యాణ్ వాయిస్ ఓవర్ వస్తుంది.
*  ఆ తర్వాత సర్ ప్రైజ్ చేస్తూ అనుష్క ఝాన్సీ లక్ష్మీభాయిగా స్క్రీన్ మీద ప్రత్యక్షమవుతుంది. అక్కడితో సినిమా ప్రారంభమవుతుంది.
* 1857 సిపాయిల తిరుగుబాటు సమయంలో ఝాన్సీ లక్ష్మీబాయి తన సైనికుల్లో స్ఫూర్తిని నింపటానికి ఉయ్యాలవాడ కథ చెబుతుంది.
* జాతర పాటతో పాటు సైరా టైటిల్ సాంగ్ ఫస్టాప్ కు హైలెట్ గా మారింది.
*  ఫస్టాప్ అంతా విజువల్ ఫీస్ట్ గా ఉంది

* ఫస్టాప్ లో కాస్తంత లాగ్ ఉన్నా.. ఇంటర్వెల్ ఎపిసోడ్  మూడ్ మొత్తాన్ని మార్చేస్తుంది
* ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్ నుంచి సినిమా రేంజ్ మారిపోతుంది
* బ్రిటీషోళ్ల మీద తొలిసారి ఉయ్యాలవాడ విరుచుకుపడే సీన్ గూస్ బంప్స్ ను తెప్పించేలా ఉంది
* ఇంటర్వెల్ ముందు అండర్ వాటర్ యాక్షన్ సీన్స్ సినిమాకు హైలెట్.
* సెకండాఫ్ మొత్తం యుద్ధాలు.. గొరిల్లా యాక్షన్ సీక్వెన్సులతో నిండాయి
* 45 నిమిషాల పాటు సాగే క్లైమాక్స్ మొత్తం భావోద్వేగంతో నిండి ఉంటుంది.
* చిరంజీవి స్టాండ్ అవుట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా సాగుతుంది.