సైరా ట్రైలర్... బాలీవుడ్ పై మరో దండయాత్ర ఖాయమా

February 16, 2020

మెగా అభిమానుల కోరిక తీరింది. ట్రైలర్ వచ్చింది. సినిమా కోసం నిరీక్షణ మొదలైంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా అంచనాలను అందుకునేలా కనిపిస్తోంది. భారత మాతకీ జై అంటూ మొదలైన ఈ ట్రైలర్లో మొదటి డైలాగ్ నుంచి దుమ్మురేపేలా ఉంది. ట్రైలర్ ఆసాంతం రోమాలు నిక్కబొడుచుకునే ఉంది. పోరాట సన్నివేశాలు, డైలాలు ఈ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశం ఉంది. ఉరికంభం ఎక్కేముందు బ్రిటిష్ వారు సైరా నరసింహారెడ్డిని...  నీ చివరి కోరిక ఏంటని న్యాయమూర్తి అడిగే ప్రశ్నకు... ’’గెటవుట్ ఫ్రమ్ మై మదర్ లాండ్‘‘ అంటూ బిగ్గరగా చిరంజీవి చెప్పే డైలాగ్... గూస్ బంప్స్.