టాటా ``ఉమెన్స్ స్పోర్ట్స్ మీట్ 2020` గ్రాండ్ సక్సెస్ 

August 10, 2020

అమెరికాలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను....ప్రత్యేకించి తెలంగాణ సంప్రదాయాలను దశదిశలా వ్యాప్తి చేసేందుకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (టాటా) ఎంతో కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే. అమెరికాలోని తెలుగు వారందరినీ ఒక్కటి చేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను టాటా చేపడుతూ వస్తోంది. భావి తరాల వారికి  తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు కొనసాగించేలా స్ఫూర్తినిస్తోంది. ఇందులో భాగంగానే  టాటా న్యూయార్క్ విభాగం ఆధ్వర్యంలో  ఫిబ్రవరి 23న `ఉమెన్స్ స్పోర్ట్స్ మీట్ 2020` నిర్వహించింది. న్యూయార్క్ లోని కింగ్స్ పార్క్ లో మహిళల కోసం రకరకాల ఇండోర్ గేమ్స్ నిర్వహించింది. కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్, త్రో బాల్, చెస్, క్యారమ్స్, టెన్నికోయిట్, హోప్ స్కాచ్ వంటి అనేక ఆటలు ఆడిన మహిళలు వారి చిన్ననాటి మధురానుభూతులను నెమరువేసుకున్నారు. భారత్, అమెరికాల జెండాలను ఆవిష్కరించిన తర్వాత ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. జీవనగరి, రితికా కట్ల, సంయుక్త వట్టిగుంట, కృతిక ఉలవలతో పాటు అన్ని వయసుల మహిళలు ఈ ఆటపాటల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.

న్యూయార్క్ లో తొలిసారి నిర్వహించిన ఈ చరిత్రాత్మక ఈవెంట్ ను నిర్వహించినందుకు గానూ టాటా న్యూయార్క్ ను మహిళలతో పాటు పలువురు ప్రశంసించారు. అతిథులు, ఆటగాళ్లు, వీక్షకులందరికీ...టీ, డ్రింక్స్, స్నాక్స్ లంచ్ ఏర్పాటు చేశారు. చివరగా జరిగిన కబడ్డీ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. ఉమెన్ ఛాంపియన్ ఆఫ్ ది డే ను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 న ప్రకటించనున్నారు. మే 22-24న న్యూజెర్సీలో జరిగే మెగా కన్వెన్షన్ 2020కి రెండు టికెట్లను ఉమెన్ ఛాంపియన్ గెలుచుకోనున్నారు. టాటా ఉమెన్స్ చైర్మన్ మాధవి సోలేటి, న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ఉషా మన్నెం, కల్చరల్ కో చైర్మన్ రమా వనమా, రీజనల్ కోఆర్డినేటర్స్ మౌనికా బర్మ, వాణి సింగరకొండలు, మరి కొంతమంది మహిళల సహకారంతో  ఈ ఈవెంట్ ను గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ ఈవెంట్ కోసం కష్టపడ్డ మహిళలందరికీ న్యూయార్క్ `టాటా` ధన్యవాదాలు తెలిపింది. ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని ప్రకటించింది. 
 
ఈ ఈవెంట్ కు సహకరించి ప్రోత్సహించిన డాక్టర్ పైళ్ల మల్లారెడ్డిగారు, టాటా న్యూయార్క్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ శరత్ వేముగంటి, సహోదర్ పెద్దిరెడ్డి, ఉషా మన్నెం, పవన్ రవ్వా, రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మాలిక్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గురుడు(లిటరరీ), మాధవీ సోలేటి(మహిళా విభాగం), కన్వెన్షన్ కల్చరల్ చైర్మన్ అశోక్ రఘురామ్ పన్నాల(లిటరరీ), రీజనల్ కోఆర్డినేటర్స్ సత్యా గగ్గెనపల్లి,యోగి వేమన, ప్రవీణ్ గోవిందు, మౌనికా బర్మ, వాని సింగరకొండలకు ధన్యావాదాలు తెలిపింది. అమెరికాతో పాటు భారత్ లో జరిగే మెయిన్ స్ట్రీమ్ ఈవెంట్స్ లో కూడా టాటా తరఫున తెలుగు మహిళలు పాల్గొనే ఆలోచనలో ఉన్నామని తెలిపింది. ఈ ఈవెంట్ కు సహకరించిన మీడియా పార్ట్ నర్స్ టీవీ 5, టీవీ 9, వీ 6, మన టీవీ, టీవీ ఏసియా, సన్ రైజ్ టీవీ, యోయో టీవీ, తెలుగు ఎన్నారై రేడియో, జీఎన్ ఎన్ రేడియో,  నమస్తే ఆంధ్ర.కామ్ కు ధన్యవాదాలు తెలిపింది. అమెరికాతోపాటు, భారత్ లోనూ తెలంగాణ పేరు దశదిశలా వ్యాపించేలా టాటా కృషి చేస్తుందని ప్రకటించింది.