తబ్లిగీల జర్నీ... భయంకరమైన నిజం !

August 12, 2020

నిజంగా ఇది భయంకరమే. తబ్లిగీ జమాత్ కు హాజరై తెలంగాణకు వచ్చిన విదేశీయులు, ఆ సమావేశానికి వెళ్లి వచ్చిన తెలంగాణలోని ముస్లింలు ఎంత మందికి ప్రమాదకరంగా మారారో తెలుసా? ... ఈ నెంబరు మీ గుండెల్లో దడ పుట్టింది. వీరు ప్రయాణించిన విమానాలు, రైళ్లలో వీరు పక్కపక్కనే ప్రయాణించిన వారి సంఖ్య 42 వేలు. అంటే దేశ వ్యాప్తంగా ఇది ఇంకెంత ఘోరంగా ఉంటుంది. ఒక్క తెలంగాణకు ప్రయాణించిన 1030 మంది ద్వారా ప్రభావితమైన సంఖ్య ఇంతుంటే... దేశంలో 29 రాష్ట్రాల నుంచి తబ్లిగీకి హాజరైన వారు, వారితో ప్రయాణించిన ఇతర సామాన్యుల పరిస్థితి ఏంటి? తలచుకుంటేనే భయంకరంగా ఉంది భవిష్యత్తు.

ఇతర రాష్ట్రాలను పక్కన పెడదాం. కేంద్ర ప్రభుత్వం టెక్నాలజీ వాడి... జమాత్ కు హాజరైన వారందనీ పట్టేసింది. వారు తిరుగు ప్రయాణంలో ఏ రైలులో, ఏ బోగీలో ప్రయాణించారో, ఏ విమానంలో ప్రయాణించారో కూడా కనిపెట్టేసింది. ఇపుడు ఆ సమాచారం ఆధారంగా వారితో పాటు ప్రయాణించిన ఇతర ప్రయాణికులకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని ప్రభుత్వం  సేకరిస్తోంది. ఈ సర్వే ఫలితాలు మెల్లగా తెలుస్తాయి. అయితే అదృష్టవ శాత్తూ... జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ వల్ల వీరంతా పెద్దగా ఎవరినీ కలిసే అవకాశం లేకపోవడం వల్ల దేశం కొంచెం సేఫ్ అయ్యింది. 22న లాక్ డౌన్ పెట్టకపోతే పరిస్థితి ఘోరంగా ఉండేది. ఈ పాటికి దేశంలో శవాల కుప్పలు తేలేవి.  అయితే ప్రభుత్వం గుర్తించి 42 వేల మంది లిస్టును రాష్ట్రంలో నమోదైన కేసులతో టాలీ  చేసుకున్న కేంద్రం... వారితో పాటు ప్రయాణించిన వారికి అదృష్టశాత్తూ పెద్దగా సోకలేదని అంచనావేస్తోంది. ఎందుకంటే వారి ద్వారా ఎవరికైనా సోకి ఉంటే... 14 రోజులు పూర్తయ్యింది కాబట్టి ఈ పాటికి ఆస్పత్రికి కేసులు వచ్చేవి. ఎవరు ఆ లక్షణాలతో ఆస్పత్రిని సంప్రదించలేదని తెలిసి కేంద్రం కాస్త ఊపిరి పీల్చుకుంది. అయినా ఎందుకైనా మంచిదని ఆ లిస్టులో ఉన్న వారిని పర్యవేక్షిస్తోంది.

తబ్లిగీలు దేశంలో సృష్టించిన దారుణం చూస్తుంటే... నిర్వహకులకు కఠిన శిక్షలు జైలు తప్పదు అని అర్థమైపోతుంది. తబ్లిగి జమాత్ పై త్వరలో నిషేధం కూడా విధించే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు... ఇక నుంచి ఇలాంటి వ్యవహారాలపై కేంద్రం మరింత దృష్టిపెట్టే ప్రమాదమూ లేకపోలేదు.