బసవతారకం ఆస్పత్రిలో స్పెషల్ డే

August 12, 2020

కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగు నింపిన బసవతరాకం ఆస్పత్రి ఆవిర్భవించి నేటికి 19సంవత్సరాలు. వార్షికోత్సవాలను ఎన్టీఆర్ కుమారుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కోడెల శివప్రసాద్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేన్సర్ విచిత్రమైన వ్యాధి అని, జాగ్రత్త పడి అది రాకుండా చూసుకోవాలని ప్రజలను కోరారు బాలకృష్ణ.  ఎన్టీ రామారావు, బసవతారకం కుమారుడిగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమని బాలకృష్ణ అన్నారు.

ఎంతో మంది శ్రమ, త్యాగ ఫలితం వల్ల ఈ ఆసుపత్రి నేడు ఈ స్థాయిలో ఉందన్నారు. ఆసుపత్రిని అద్భుతంగా నడిపిస్తున్న నిర్వాహక యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు బాలకృష్ణ. కేన్సర్ రోగులకు బసవతారకం ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స అందుతోందని, అవసరమైన వారు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.