తమన్నా ఫిట్‌నెస్ ... సెగలు రేపుతోంది

August 14, 2020

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి లాక్‌డౌన్ సమయంలో వర్కౌట్స్‌లో ఎక్కువ సమయం గడుపుతోంది. ఈ బ్యూటీ దివాకు ఫిట్‌నెస్ పట్ల చాలా స్పృహ ఉందని మనకు తెలిసిన విషయమే. 10 సంవత్సరాలుగా అదే ఫిజిక్ ను మెయింటెయిన్ చేస్తూ తన అందచందాలను కాపాడుకుంటోంది.  తమన్నా తన ఖాళీ సమయాన్ని ఎక్కువగా వ్యాయామశాలలో గడపడానికే ఇష్టపడుతుంది. 

ఇంట్లో చిన్న సైజు జిమ్ ఏర్పాటుచేసుకున్న తమన్నా ఈ ఖాళీ సమయంలో చేసిన ఫీట్లతో ఒక వీడియోను అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ వీడియో చూస్తే ఫిట్నెస్ కోసం ఆమె పట్టుదల అర్థమైపోతుంది.

తమన్నా వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి, "నేను మీకు 'ఆర్ట్ ఆఫ్ ఫాలింగ్' అందిస్తున్నాను. మీరు సరిగ్గా నేర్చుకోకుండా ప్రయత్నం చేస్తే ప్రమాదం జాగ్రత అంటూ వీడియోను పోస్టు చేసింది.