మీడియా దెబ్బ‌కు త‌మ‌న్నాకు వ‌రుస ఫోన్ కాల్స్!

February 24, 2020

ఇవాల్టి రోజుల్లో అమాయ‌కులు ఎవ‌రుంటారు. అందునా.. సినీ నిత్యం వంద‌ల మందిని చూసే సినీ న‌టులు ఒక ప‌ట్టాన మోస‌పోతారా? ఒక‌ట్రెండు కాదు.. ద‌శాబ్దాన్ని దాటేసి.. రెండో ద‌శాబ్దంలోనూ త‌న స‌త్తా చాటుతున్న త‌మ‌న్నా లాంటోళ్లు ఉత్త‌ర‌గా మోస‌పోయే ఛాన్స్ ఉండ‌దు క‌దా. కానీ.. మీడియాలో జ‌రిగిన అతి ప్ర‌చారంతో అమ్మ‌డికి ప‌లువురు ఫోన్లు చేసి క్లాసులు పీకుతున్నార‌ట‌. అయితే.. తన‌కూ లెక్క‌లు తెలుసంటూ అమ్మ‌డు త‌న మాట‌ల‌తో స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నం చేస్తోంది మిల్క్ బ్యూటీ.
ఇంత‌కూ జ‌రిగిందేమంటే.. ఈ మ‌ధ్య‌నే ముంబ‌యి మ‌హాన‌గ‌రంలో ఫ్లాట్ ను కొన్న త‌మ‌న్నా ఒక ఇంటిదైంది. స‌మీర్ బోజ్ వాణి అనే వ్య‌క్తి నుంచి చ‌ద‌ర‌పు అడుగు రూ.80,778 చొప్పున వెర్సోవా ప్రాంతంలో ఒక ఫ్లాట్ కొనుగోలు చేసింది. ఈ ఫ్లాట్ ఖ‌రీదు మొత్తం రూ.16.6 కోట్లు. అయితే.. మీడియాలో ఆమె కొనుగోలు చేసిన ధ‌ర‌కు డ‌బుల్ ధ‌ర పెట్టి ప్లాట్ కొనుగోలు చేసిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. 2055 చ‌ద‌ర‌పు అడుగుల ఇంటి కోసం దాదాపు రూ.33 కోట్ల‌కు పైనే ఖ‌ర్చు చేసిన‌ట్లుగా ప్ర‌చారం సాగింది.
దీంతో.. ఆమెకు తెలిసినవారు..స‌న్నిహితులు త‌మ‌న్నాకు ఫోన్ చేసి మ‌రీ క్లాసులు పీకుతున్నార‌ట‌. చివ‌ర‌కు ఆమెకు హిందీ పాఠాలు చెప్పిన టీచ‌రు సైతం ఫోన్ చేసింది.. అదేమిట‌మ్మాయ్.. డ‌బుల్ రేటు పెట్టి ఎందుకు కొన్నావ్‌? అని క్వ‌శ్చ‌న్ చేసింద‌ట‌. అలా ఫోన్లు చేసిన వారంద‌రికి ఓపిగ్గా.. అలాంటిదేమీ లేద‌ని.. తాను కొన్న‌ది రూ.16 కోట్ల‌కేన‌ని.. మీడియాలో ఎక్కువ ధ‌ర పెట్టిన‌ట్లు ప్ర‌చారం జ‌రిగినా.. అది నిజం కాద‌ని చెప్పింద‌ట‌.
ఇంటి కొనుగోలులో ఎక్కువ ధ‌ర పెట్టాన‌ని భావించి ఫోన్ చేస్తున్న వారి దెబ్బ‌తో త‌మ‌న్నా.. ఓపెన్ గా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది. తాను కొన్న ఇంటి విష‌యంలో మీడియా అతి చేసి.. తాను కొన్న‌దాని కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింద‌ని.. అది త‌ప్ప‌న్న విష‌యాన్ని ఆమె వెల్ల‌డించారు. అంతేకాదు.. నాకు లెక్క‌లు తెలీవా? నేనెందుకు ఎక్కువ పెట్టి కొంటాను? అంటూ క్వ‌శ్చ‌న్ చేస్తోంది. శుభ‌మా అని ఇల్లు కొన్న సంతోషం లేకుండా చేసేలా జ‌రిగిన ప్ర‌చారంపై మిల్కీ కాస్తంత గుర్రుగా ఉంద‌ట‌.