బోల్డ్ ఛాలెంజ్... స్వీకరించిన తమన్నా

August 07, 2020

లాక్ డౌన్ వేళ అనేక ర‌కాల ఛాలెంజెస్ చూస్తున్నాం. బి ద రియ‌ల్ మ్యాన్ అంటూ ఇంటి ప‌నులు చేసి వీడియోలు పెట్ట‌మంటూ అర్జున్ రెడ్డి దర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన పిలుపుకు మేల్ ఫిలిం సెల‌బ్రెటీస్ ఎంత బాగా స్పందిస్తున్నారో తెలిసిందే. ఇదే త‌ర‌హాలో అమ్మాయిలు కూడా ర‌క‌ర‌కాల ఛాలెంజెస్ విసురుతున్నారు. మెగా ఫ్యామిలీ లేడీస్ చేసిన ఓ ఛాలెంజ్ ఆస‌క్తి రేకెత్తించింది. ఐతే లాక్ డౌన్ వేళ ప్ర‌పంచవ్యాప్తంగా సెలెబ్రెటీ లేడీస్ చేస్తున్న ఓ ఛాలెంజ్ మాత్రం చాలా బోల్డ్‌గా ఉంది. దాన్ని మ‌న ఇండియ‌న్ హీరోయిన్స్ అంత‌గా అందిపుచ్చుకోలేక‌పోతున్నారు. అదే.. పిల్లో డ్రెస్ ఛాలెంజ్. ఒంటిపై ఏ ఆచ్ఛాద‌నా లేకుండా పిల్లోతో ఒంటిని క‌ప్పుకుని ఫొటోల‌కు పోజులివ్వ‌డ‌మే ఈ ఛాలెంజ్ ఉద్దేశం.
ఈ బోల్డ్ ఛాలెంజ్‌ను మ‌న ద‌గ్గ‌ర ఒక్క ఆర్ఎక్స్ 100 భామ‌ పాయ‌ల్ రాజ్ పుత్ మాత్ర‌మే అందిపుచ్చుకుంది. ఆమె కొన్ని రోజుల కింద‌ట‌ చేసిన పిల్లో ఫొటో షూట్ కుర్రాళ్ల‌కు మంచి కిక్కే ఇచ్చింది. ఐతే పాయ‌ల్ ఎంతైనా చిన్న స్థాయి హీరోయిన్. కాబ‌ట్టి ఆమె ఫొటోలు అంతగా వైర‌ల్ కాలేదు. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్ త‌మ‌న్నా భాటియా ఈ ఛాలెంజ్‌ను స్వీక‌రించింది. పిల్లోను డ్రెస్‌గా మార్చుకున్న ఆమె నేల‌పై ప‌డుకుని సెక్సీ పోజులిచ్చింది. ఇక అంతే కుర్రాళ్లు ఆగ‌ట్లేదు. ఈ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. త‌మ్మూనే ఈ బోల్డ్ ఛాలెంజ్ స్వీక‌రించింద‌టే.. ఇక మ‌రింద‌రు హీరోయిన్లు దీన్ని అందిపుచ్చుకుంటార‌ని భావించొచ్చు. మ‌రి ఎవ‌రెలా హైలైట్ అవుతారో చూద్దాం.