తమ్మినేనికి జ్జానోదయం... గవర్నమెంటుపై విమర్శలు

May 31, 2020

తమ్మినేని సీతారం ఊహించని విమర్శలు చేశాడు. వైసీపీ ప్రభుత్వం పనితీరును నిందించేలా ఈ వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. (జగన్ సారథ్యంలోని) ఎక్సైజ్ శాఖ పనితీరు అస్సలు బాగోలేదని ఆయన విమర్శించారు. మందు నిషేధంలో ఉండటంతో రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. పరిస్థితి చూస్తుంటే ఎక్సైజ్ శాఖ నిద్రపోతోందని అన్నారు.

నాటు సారా మాత్రమే కాదు, గంజాయి, నిషేధించిన గుట్కా.. విచ్చలవిడిగా దొరుకుతోందన్నారు. నాటు సారా తయారీ దారులు కొందరు మాఫియాగా ఏర్పడి ఇది నిర్వహిస్తున్నారని, ఈ వ్యాపారంతో కొందరు రాత్రికిరాత్రే కోటీశ్వరులు అవుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ ఇలాంటి వాటిపై దృష్టిపెట్టలేదని, వెంటనే వీరిపై దృష్టిసారించి నాటు సారాను అంతం చేసేలా ఎక్సైజ్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

ఒక స్పీకరుగా ఉండి కూడా అనేక సార్లు పార్టీ తరఫున ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన తమ్మినేని సీతారాం ఇలా సడెన్ గా జగన్ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదనడం వెనుక మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. ఆ శాఖ మంత్రిపై ఏమైనా కోపంతో ఇలా చేశారా? లేకపోతే తనకు నచ్చని వాళ్లు సంపాదించేస్తున్నారని ఇలా అన్నారా? లేక నిజంగానే సరిగా ప్రభుత్వం పనిచేయడం లేదని విమర్శిస్తున్నారా అన్న క్లారిటీ లేదు గాని ఇలాంటి వాస్తవాలు బయటకు తీసుకురావడం మాత్రం మంచిపనే అని చెప్పొచ్చు.