తానా మహాసభలకు ముఖ్యఅతిథి ఎవరంటే...

July 14, 2020

తానా మహాసభల సందడి మొదలైంది. 2019 జులై 4 నుంచి 6 వ తేదీ వరకు ఘనంగా జరిగే ఈ వేడుకలకు తానా అధ్యక్షుడు సతీష్ వేమన పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కేటీఆర్ ను కలిసి ఆహ్వానం అందించిన తానా .... తాజాగా ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుని ఆహ్వానించింది. ఆయన అంగీకారం తెలిపినట్టు సతీష్ వేమన ప్రకటించారు. వెంకయ్యనాయుడుతో పాటు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

ఈసారి తానా మహాసభలు వాషింగ్టన్ డీసీ నగరంలో జరగనున్నాయి. తొలిసారి తానా వేదికపై శ్రీవారి కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నారు. రెండేళ్లకు ఒకసారి తానా మహాసభలు జరుగుతూ వస్తున్నాయి. ఇవి 22వ మహాసభలు. అమెరికాలో స్థిరపడిన తెలుగువారంతా ఘనంగా జరుపుకునే వేడుక ఇది. అమెరికా తెలుగు సంఘాల్లో మొదటి సారి ఆవిర్భవించిన సంఘం తానాయే. ఈ సారి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖులు ఈ మహాసభల్లో పాల్గొననున్నారు. తెలంగాణలో కేటీఆర్ తో పాటు మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, చామకూర మల్లారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి లకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహా సభల అధ్యక్షుడు సతీష్ వేమన ఆహ్వాన పత్రిక అందించారు.