Photos: ఘనంగా ముగిసిన తానా మహా సభలు

November 19, 2019

అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటరులో మూడు రోజుల పాటు జరిగిన 22వ తానా మహాసభలు అట్టహాసంగా శనివారం సాయంత్రం ముగిశాయి. సభలు జరిగిన ప్రతిసారి తానా కొత్త అధ్యక్షుడు బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత తానా అధ్యక్షుడు వేమన సతీష్ పదవీకాలం ముగిసింది. ఆయన నుంచి తాళ్లూరి జయశేఖర్‌ బాధ్యతలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా పలువురికి తానా అవార్డులను అందజేసింది. రామోజీరావు వియ్యంకులు భారత్ బయోటెక్ అధినేత ఎల్లాకృష్ణకు తానా పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. ‘‘తానా తరఫున రూ.7 కోట్ల రూపాయల విలువైన వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తామని వేదికపై ప్రకటించారు. దీంతో హర్షధ్వానాలతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. సభికులకు, కార్యకర్తలకు తానా 22వ మహాసభల సమన్వయకర్త డాక్టర్ మూల్పూరి వెంకటరావు, ఛైర్మన్ డాక్టర్ నరేన్ కొడాలి ధన్యవాదాలు తెలిపారు.