తెలుగు రాష్ట్రాల సేవలో తానా మరో ముందడుగు

November 14, 2019

తానా ఫౌండేషన్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత్ బయోటెక్ సహాయంతో “కిడ్స్ ఎడ్యుకేషన్ & అడల్ట్స్ టీకా” కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెలా తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లోని 5 గ్రామాల్లోని ప్రజలకు ఉచిత హెపటైటిస్ బి, టైఫాయిడ్ వ్యాక్సిన్లను అందించనున్నారు.

తానా ఫౌండేషన్ ఈసారి విద్య, ఆరోగ్య అంశాలపై దృష్టిపెట్టింది. ఈ మేరకు రూపొందించిన "కిడ్స్ ఎడ్యుకేషన్ & అడల్ట్ టీకా" అనే థీమ్‌ను భారత్ బయోటెక్ సిఇఓ కృష్ణ ఎల్లా గారిని ఫౌండేషన్ ముఖ్యులు కలిసి వివరించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్లకు భారత్ బయోటెక్ సహకారం అందిస్తోంది.
ఈ కార్యక్రమానికి జే తాల్లూరి, సతీష్ వేమన, బ్రహ్మజీ వలివేటి, హరీష్ కోయ పలువురు తానా ప్రతినిధులు కలిశారు.