తెలుగు రాష్ట్రాల సేవలో తానా మరో ముందడుగు

August 06, 2020

తానా ఫౌండేషన్ ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భారత్ బయోటెక్ సహాయంతో “కిడ్స్ ఎడ్యుకేషన్ - అడల్ట్స్ టీకా” కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెలా తెలంగాణ, ఎపి రాష్ట్రాల్లోని 5 గ్రామాల్లోని ప్రజలకు ఉచిత హెపటైటిస్ బి, టైఫాయిడ్ వ్యాక్సిన్లను అందించనున్నారు.
తానా ఫౌండేషన్ ఈసారి విద్య, ఆరోగ్య అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టింది. అందులో భాగంగా రూపొందించిన కార్యక్రమమే "కిడ్స్ ఎడ్యుకేషన్ & అడల్ట్ టీకా". దీనిని ఒక థీమ్‌ లా తీసుకుని సేవా కార్యక్రమాలు చేయనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను భారత్ బయోటెక్ సిఇఓ కృష్ణ ఎల్లా గారిని ఫౌండేషన్ ముఖ్యులు కలిసి వివరించారు. ఈ కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్లను సమకూర్చడంలో భారత్ బయోటెక్ సహకారం అందిస్తోంది. కృష్ణను ఎల్లాను కలిసిన బృందంలో తానా ఫౌండేషన్ ఛైర్మన్ నిరంజన్ శృంగవరపు,  బ్రహ్మజీ వలివేటి, హరీష్ కోయ తదితరులు ఉన్నారు.