ఫొటోలు - ఘనంగా తానా-2019 మహాసభలు ప్రారంభం

August 06, 2020

తానా 22వ వార్షికోత్సవ సభలు అట్టహాసనంగా ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకల కోసం వాషింగ్టన్ డీసీలో అంగరంగవైభవంగా ఏర్పాట్లు చేశారు. తెలుగు ప్రముఖులతో ఈ వేడుకలు కళకళలాడునున్నాయి. ఇందులో భాగంగా ఫండ్ రైజింగ్ ఈవెంట్లు, ధీంతానాల సందడి, క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ వేడుకలకు పవన్ కల్యాణ్, సింగర్ సునీత, సంగీత దర్శకుడు థమన్, రాజకీయ నాయకులు పయ్యావుల కేశవ్, విష్ణు, యాంకర్ సుమ తదితరులు పాల్గొన్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం విందు కార్యక్రమంతో మహాసభలు మొదలయ్యాయి. అమెరికా, పలు ఇతర దేశాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి 12 వేల మంది ప్రతినిధులు ఈ వేడుకలకు హాజరవుతారవుతున్నారు.

హైలైట్స్
1 . వివిధ రంగా ల్లో అద్భుతప్రతిభ కనబరిచిన ప్రముఖులకు అవార్డులు ప్రధానం.
2. రెండో రోజు కాకినాడ శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద, విశ్వయోగి విశ్వంజీల ఆధ్యాత్మిక ప్రవచనాలతో కార్యక్రమాలు.
3. తొలిసారి తానా వేదికపై శ్రీనివాస కళ్యాణం.
4. వాణిజ్య, మహిళా, యువజన సదస్సులు 5, 6 తేదీల్లో జరుగుతాయి.
5. ప్రముఖ రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ దర్శకత్వంలో రూపొందించిన శ్రీకృష్ణరాయభారం నాటక ప్రదర్శన
6. ముఖ్య అతిథులుగా బీజేపీ నేత రాంమాధవ్‌, సినీ నటుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌, ప్రముఖ క్రికెట్‌ క్రీడాకారుడు కపిల్‌ దేవ్‌ పాల్గొంటారు. సినీ ప్రముఖులు అశ్వనీదత్‌, కె.రాఘవేంద్రరావు, విజయేంద్ర ప్రసాద్‌, జొన్నవిత్తుల, గాయని సునీత, రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, పారిశ్రామికవేత్త ఎల్లా కృష్ణ, ప్రముఖ అవధాన పండితుడు మేడసాని మోహన్‌, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాసగౌడ్‌ హాజరవుతున్నారు. ప్రముఖ సినీనటులు పూజా హెగ్డే, జగపతిబాబు ప్రధాన ఆకర్షణగా సందడి చేయనున్నారు.
7. మహాసభల ప్రారంభం రోజున తమన్‌, చివరి రోజున కీరవాణి సంగీత విభావరి నిర్వహిస్తున్నారు.