మన ఊరి కోసం తానా 5కె రన్... సూపర్ సక్సెస్

August 07, 2020

’’మన ఊరికోసం -5కె రన్‘‘ కార్యక్రమాన్ని కొన్నేళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం)  ఈసారి కూడా ఆ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. ఇది నాలుగో ఏడాది. దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. బే ఏరియాలో జరిగిన 5కె రన్ లో సుమారు 140 మంది ఎన్నారైలు పాల్గొని దీనిని విజయవంతం చేశారు.  జన్మభూమి రుణం తీర్చుకోవడానికి నడుం కట్టిన ఎన్నారైలు తానా ఆధ్వర్యంలో ఈకార్యక్రమం ద్వారా ఫండ్స్ రైజ్ చేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లోని గ్రామాల అభివృద్ధి, సామాజిక ఉన్నతి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. సదుద్దేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ప్రతి ఏడాది ఎన్నారైలు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. 

ఈ పరుగులో పాల్గొనేందుకు చెల్లించే రుసుమును తానా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలకు పారదర్శకంగా ఖర్చు చేస్తామని నిర్వహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రజనీకాంత్ కాకర్ల (TANA RVP), భక్త బల్లా (TANA Foundation Trustee), సతీష్ వేమూరి(TANA Treasurer), వెంకట్ కోగంటి (TANA Joint Tresurer), శ్రీకాంత్ దొడ్డపనేని, చంద్ర గుంటుపల్లి, నవీన్ కొడాలి, శ్రీనివాస్ వల్లూరిపల్లి, యశ్వంత్ కుదరవల్లి, హరి గక్కని, రామ్ తోట, కేపీ శ్రీకాంత్, లియాన్ బోయపాటి, భరత్ ముప్పిరాల, రాజా కొల్లి, గాంధీ పాపినేని, సుజాత అరికపూడి, మోహన్ మాలంపాటి, విజయకృష్ణ గుమ్మడి, లక్ష్మీపత్ గడిరాజు, శ్రీకాంత్ బొల్లినేని, అనిల్ రాయల, మురళి గొడవర్తి తదితరు పాల్గొన్నారు.  

నిర్వహకులు కార్యక్రమానికి సహకరించిన బావర్చి ఇండియన్ క్యుజిన్ వారికి, ఎస్.ఆర్.ఎస్. కన్సల్టింగ్ ఇంక్ వారికి, జాస్పర్ టెక్నాలజీస్ వారికి, స్వాగత్ వారికి, రైట్ ప్రోస్ వారికి, మల్లికార్జునరావు మామిడిపాక గారికి కృతజ్జతలు  తెలిపారు.