టాంటెక్స్ : ఆహ్లాదకరంగా లాహిరి, లాహిరిలో... నౌకావిహారం

November 14, 2019

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) జూలై 28న లూయిస్ విల్ లేక్ లో ఏర్పాటు చేసిన “లాహిరి, లాహిరిలో... నౌకావిహారం” కార్యక్రమం అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ఘనంగా జరిగింది. వనితా వేదిక కమిటీ తరుపున శ్రీలక్షి మండిగ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సంస్థ అధ్యక్షులు (2019) చినసత్యం వీర్నపు అందరికి స్వాగతం పలికి, టాంటెక్స్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం టాంటెక్స్ కార్యవర్గ సభ్యులను పరిచయం చేశారు. సభ్యుల సహాయ సహకారాలతోనే ఇటువంటి మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురాగగుతున్నాం అని చెప్పారు.
అనంతరం లూయిస్ విల్ లేక్ బోట్ యాజమాన్యం టాంటెక్స్ సభ్యులు అందరిని బోట్ లోకి ఆహ్వానించి 4:30 నిమిషాలకి లాహిరి లాహిరి లాహిరిలో...అనే పాటతో ప్రయాణం మొదలు పెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీలు మండిగ నేతృత్వంలో మంచి ఉల్లాస కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలకోసం మంచి బింగో, అంత్యాక్షరి, డం షరేడెస్, ఆట పాటలు మరియు ఇంకెన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి 4 గంటలు పాటు సరస్సు మధ్యలో విహరిస్తూ అందరిని ఆనందడోలికల్లో ముంచెత్తారు.
ఇండియా నుంచి అమెరికా పిల్లలను చూడడానికి వచ్చిన తలిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సంతోషం వ్యక్తపరుస్తూ టాంటెక్స్ వారిని అభినందించారు. టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు సరస్సు మధ్యలో విహరిస్తున్న అంతసేపు కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు అందరికి కావలసిన ఏర్పాట్లలో ఎటువంటి లోటు పాట్లు లేకుండా సహాయ సహకారాలు అందించారు. టాంటెక్స్ అధ్యక్షులు శ్రీ వీర్నపు చినసత్యం మాట్లాడుతూ ప్రత్యేకంగా మహిళల కోసం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, ముందు ముందు మహిళల కోసం ఇంకా మంచి కార్యక్రమాలను తీసుకురావడంలో సంస్థ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమ ప్రసార భాగస్వామి TV5, Mana TV ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సుందర్ తురుమెల్ల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు అందరికి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రసార మాధ్యమాలైన టివి5 , మన టివి, టీవీ9, టి.ఎన్.ఐ, ఫన్ ఏషియా, దేసిప్లాజ , తెలుగు టైమ్స్, ఐఏసియా లకు, పసందైన ఫలహారలను అందించిన బశేరా రెస్టారెంట్ వారికి కృతఙ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాధ్యక్షులు కృష్ణారెడ్డి కోడూరు , ఉపాధ్యక్షులు పాలేటి లక్ష్మి, కార్యవర్గ సభ్యులు సతీష్ బండారు, వెంకట్ బొమ్మ, కళ్యాణి తాడిమేటి, సౌమిత్రి తుపురాని, వసుంధర కాకి, సౌమ్య మాదాల, ఇండియా నుంచి వచ్చిన వీరమ్మ మాదాల గారు, శశిరేఖ పట్నాయక్ గారు మరియు పలు ప్రముఖులు పాల్గొన్నారు. ఎంతో కృషి, సమయం వెచ్చించిన టాంటెక్స్ కార్యవర్గ సభ్యులకు మరియు వివిధ కమిటీ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.