ఆర్టీసీ సమ్మె పై 'టాక్ లండన్' బహిరంగ లేఖ

August 08, 2020

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో జరుగుతున్న ఆర్టీసి సమ్మె మరియు ముఖ్యంగా కార్మికుల  ఆత్మహత్యలపై చలించిన ప్రవాసులు , బహిరంగ లేఖను రాసారు. ఇందులో ప్రభుత్వానికి కార్మికులకు సమ్మె విరమించేలా కృషి చెయ్యాలని కోరారు.
ఆత్మహత్యలు చాలా బాధిస్తున్నాయని, తెలంగాణ రాష్ట్రం లో ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టమని, ఎవరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని ప్రార్థించారు.

ప్రపంచంలో తెలంగాణ బిడ్డ ఎక్కడున్నా, నాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుకొని తెలంగాణ సమాజం వెంట ఉండి రాష్ట్ర సాధనంలో తమ వంతు బాధ్యత నిర్వహించారు.

సాదించికున్న రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆశించిన ఫలితాలు పొంది సంతోషంగా ఉంటూ, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ గా , దేశంలోనే అగ్రస్థానం లో నిలిపారని సంతోషిస్తుంటే, మళ్ళీ ఆర్టీసీ కార్మీకుల ఆత్మబలిదానాలు మమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తుంది.

సమస్య చిన్నదైనా పెద్దదైన ఆత్మబలిదానమనేది అత్యంత బాధాకరమైన సంఘటన, దయచేసి ఆవేశానికి లోనుకాకుండా, మీ పై ఆధారపడ్డ కుటుంబం గురించి అలోచించి, దయచేసి ఆత్మహత్యలకు పాల్పడొద్దని మా ప్రార్థన.

వివిధ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మిక కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ, మా టాక్ సంస్థ ద్వారా త్వరలో చేతనైనంత సహాయం కూడా అందిస్తామని తెలుపుతున్నాము.

ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెను విరమింపజేసి, ప్రభుత్వం తో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారు, అటువంటిది ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రత్యేక ద్వేషం ఎందుకు ఉంటది. రైతులు, కార్మికుల పట్ల తెలంగాణ సమాజానికి ఎల్లప్పుడూ ప్రత్యేక సానుభూతి ఉంటుంది , కొంత సంవయనంతో ఉండి సమస్యలను పరిష్కరించుకుంటే ఆత్మహత్యలు లాంటి దురదృష్ట సంఘటనలు నివారించచ్చు.

ప్రభుత్వం కూడా మానవతా దృక్పథంతో అలోచించి, వేల కార్మిక కుటంబాలకు జీవనోపాధిగా ఉన్న వారి ఉద్యాగాలల్లో వారు చేరే విధంగా చర్యలు తీసుకొని, సాధ్యమైన సమస్యలన్నీ పరిష్కరించి తెలంగాణ లో సాధారణ పరిస్థితి వచ్చేలా కృషి చెయ్యాలని మా ప్రార్థన.

ఆర్టీసీ కార్మికులు నాయకులు మీ పోరాటానికి మీరే నాయకత్వం వహిస్తే మీకు అందరి మద్దత్తు ఉంటుంది, అలా అని అవకాశవాద రాజకీయ నాయకులకు పెత్తనమిస్తే, ప్రభుత్వాన్ని సమర్ధించే వ్యక్తులు సంస్థలు కూడా ఉంటారని మీరు గమనించాలి.

ఇప్పటికీ వివిధ సందర్భాల్లో తెలంగాణ ఉద్యమ సమయం లో ఆర్టీసీ కార్మికుల, సకల జనుల పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ ఎంతో స్ఫూర్తిని పొందుతాము, కాబట్టి మీరు కూడా కొంత సంయనం తో అలోచించి సమస్య పరిష్కారానికి కృషి చెయ్యాలని మా మనవి.

త్వరలో సమస్యలన్నీ తీరాలని, మల్లి తిరిగి తెలంగాణ సమాజాం పురోగతి వైపు పయనం చేయాలనీ కోరుతున్నాము.