రిలయన్స్ కి బ్యాడ్ న్యూస్ 

August 12, 2020

అనేక సంవత్సరాలుగా భారతీయ దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న రిలయన్స్ కి మింగుడు పడని వార్త ఇది. అనేక రంగాల్లో విస్తరించిన రిలయన్స్ కంపెనీని... టాటాలోని ఒక విభాగం పడగొట్టేసింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా దగ్గడంతో రిలయన్స్ షేరుకు డిమాండ్ పడిపోయింది. దీంతో ఆ షేరు గత చివరి ట్రేడింగ్లో 13 శాతం పడింది. షేర్లు పడటం పెరగడం మామూలే కానీ... భారీ ధర పలుకుతున్న రిలయన్స్ షేరు 13 శాతం పడటంతో సడెన్ గా ఆ కంపెనీ రెండో స్థానానికి పడిపోయింది. ఇపుడు దేశంలో అత్యంత విలువైన కంపెనీ హోదాను రిలయన్స్ కోల్పోయింది. మరి ఆ స్థానాన్ని ఇపుడు ఎవరు దక్కించుకున్నారో తెలుసా? 

టీసీఎస్ ... టాటా గ్రూపునకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ఇపుడు 7.05 లక్షల కోట్ల విలువతో దేశంలోనే సంపన్న కంపెనీగా అవతరించింది. రిలయన్స్ వర్గాలకు ఇది అస్సలు మింగుడు పడటం లేదు. నిన్నా మొన్నటివరకు 10 లక్షల కోట్ల విలువతో కూడిన ఆ కంపెనీ ఇపుడు 7 లక్షల కోట్లకు పడిపోయింది. దానికంటే కొంచెం ఎక్కువగా ఉన్న టీసీఎస్ మొదటి స్థానంలో నిలిచిపోయింది. అయితే... ఇది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం. మళ్లీ ఏవైనా అనుకూలతలు వస్తే ... అప్పటికి టీసీఎస్ విలువ పెరగకపోతే.... మళ్లీ రిలయన్స్ కంపెనీ మొదటి స్థానానికి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఏది ఏమైనా... ఇది రిలయన్స్ కు ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్.

అయితే... మళ్లీ రిలయన్స్ మొదటి స్థానానికి రావచ్చేమో గాని... టాటా గ్రూపులోని ఒక విభాగంగా రిలయన్స్ గ్రూపులోని ఒక సమూహపు ప్రతినిధిగా నిలిచిన రిలయన్స్ షేరును పతనం చేయడం చాలా పెద్ద విశేషం.