​బే ఏరియాలో ఘనంగా టీడీఎఫ్ బతుకమ్మ

August 06, 2020

అమెరికాలోని బే ఏరియాలో బతుకమ్మ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. 1500 మందికి పైగా ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.  5 అక్టోబర్ 2019 శనివారం రోజు లేక్ ఎలిజబెత్ పార్క్ వద్ద బే ఏరియాలో ఈ ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజలు మాత్రమే కాకుండా తెలుగు ప్రజలు మొత్తం ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ప్రకృతిని పూజించే ప్రత్యేకమైన, పవిత్రమైన వసంత ఉత్సవమే బతుకమ్మ. 
అనేక రకాల పూలతో ఘనంగా అలంకరించిన బతుకమ్మను పూల ముగ్గుల మధ్య ఉంచి  వాటి చుట్టూ నాట్యం చేస్తూ ఎన్నారైలు సందడి చేశారు. ఆకర్షణీయమైన సీజనల్ పువ్వుల నుండి రంగురంగుల బతుకమ్మను తయారు చేయడంతో అవెంతో కనుల విందుగా ఉన్నాయి. కార్యక్రమం అనంతరం బతుకమ్మలను నీటిలో వదిలేశారు.  ఈ కార్యక్రమం విజయవంతానికి ఎంతో మంది సహకరించారు. నిర్వహకులు బే ఏరియా తెలుగు ప్రజలు అందరికీ కృతజ్జతలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు టిడిఎఫ్ సంస్థ వాలంటీర్లు, స్పాన్సర్లకు ప్రత్యేక కృతజ్జతలు తెలిపింది.  ​