సెగ తగిలింది : ఆ ఇద్దరికీ బాబుతో మీటింగ్

December 13, 2019

వారిద్దరికీ చంద్రబాబు నుంచి ఎట్టకేలకు ఫోనొచ్చింది. ట్విట్టర్ వేదికగా ఒకరిపై మరొకరు బూతు విమర్శలు చేసుకొంటున్న కేశినేని నాని, బుద్దా వెంకన్నలకు టీడీపీ నాయకత్వం పిలిపించి మాట్లాడాలనుకుంటోంది. మీ వల్ల మీ పరువే కాదు, పార్టీ పరువు కూడా పోతుందనంటూ ఇద్దిరినీ ఫోన్లో వాయించింది. దీంతో ఇప్పటికే బుద్ధా వెంకన్న ట్వీట్ల యుద్ధాన్ని ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఇద్దరు నేతలు చంద్రబాబుతో సమావేశం అయ్యే అవకాశం ఉంది.

టీడీపీ ఎంపీ కేశినేని నాని అదే పార్టీకి చెందిన బుద్దా వెంకన్నపై తీవ్ర విమర్శలు చేశారు. తొలి ట్వీట్ కేశినేని నానిది. అయితే అప్పటికే నాని ఫ్రెండుకు ఫోన్ చేసి వెంకన్న ఏదో అనడం వల్లే నాని ఆ ట్వీట్ వేశాడని అంటున్నారు. ఏదేమైనా రాష్టం మొత్తం వీరి ట్వీట్లు చూసి పార్టీని తిట్టింది.
సుమారు 24 గంటల పాటు అనేక ట్వీట్లు వేసుకున్నారు. ఈరోజు కూడా ఆ ట్వీట్లు కొనసాగాయి. ఇక ఆపకపోతే కష్టమని భావించిన పార్టీ అధిష్టానం చివరకు వారిద్దరినీ పిలిచి మాట్లాడటానికి సిద్ధమైంది. అయితే, ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. వాస్తవానికి ఒకటి రెండు ట్వీట్లతోనే ఆపాల్సింది ఇది. ఇద్దరు నేతలతో చంద్రబాబునాయుడు సమావేశం అయ్యి... ఏం చెబుతారో చూడాలి.