చంద్ర‌బాబు.. ఆమ్ ఆద్మీత‌ర‌ఫున‌ ప్ర‌చారం ?

July 01, 2020
కేజ్రీవాల్ చంద్ర‌బాబుకు ప్ర‌త్యేక గౌర‌వం ఇస్తూనే సంక‌టంలో ప‌డేశాడు. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ తాజా నిర్ణ‌యం ఫ‌లితం ఇది. ఇంత‌కీ ఆయ‌న ఏం చేశారంటే...ఇంకో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేయాల‌ని చంద్ర‌బాబుకు ఆహ్వానం పంపుతారట‌. చంద్ర‌బాబుతో పాటు కేజ్రీ మ‌మ‌తాబెన‌ర్జీ వంటి ఇంకొంద‌రికి కూడా పంప‌నున్నారు. ఆయ‌న పిల‌వ‌డం వ‌ర‌కు చంద్ర‌బాబుకు ఇబ్బంది లేదు గాని... త‌న కూట‌మికే తాను వ్య‌తిరేక ప్ర‌చారం చేయాల్సి వ‌స్తుంది.
ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్ల‌లో పోటీ చేయ‌నుంది. ఇప్ప‌టికే ఆరు సీట్ల‌కు అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించింది. ఢిల్లీలో త‌మ పార్టీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారానికి రావాల‌ని తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుల‌ను ఆయ‌న కోర‌నున్నారు. అయితే, ఇక్క‌డ చిక్కు ఏంటంటే... కాంగ్రెస్ కూడా ఆ ఏడు సీట్ల‌లో పోటీ చేస్తోంది. అంటే.. చంద్ర‌బాబు ఆప్ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తే... కాంగ్రెస్‌కు ఓటేయొద్ద‌ని చెప్పిన‌ట్లే.  
మ‌రి కాంగ్రెస్ జాతీయ కూట‌మిలో కీల‌క పాత్ర పోషిస్తూ ఆ కూట‌మి పెద్ద‌న్న కాంగ్రెస్ పోటీ చేస్తున్న సీట్ల‌లో చంద్ర‌బాబు ఇత‌ర పార్టీకి ఎలా ప్ర‌చారం చేస్తారు అన్న‌ది పెద్ద స‌మ‌స్యే. మ‌రి చంద్ర‌బాబు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.