దసరా తర్వాత టీడీపీలో పెద్ద మార్పు

July 05, 2020

అదేంటో అన్ని పార్టీలు అధికారంలో ఉంటే స్ట్రాంగ్ గా ఉంటాయి. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రతిపక్షంగా ఉన్నపుడు స్ట్రాంగ్ గా పనిచేస్తుంది. గత ఐదేళ్ల అధికారంలో చంద్రబాబు ఎంత సేపూ పరిపాలన మీద దృష్టిపెట్టి పార్టీని నిర్లక్ష్యం చేశారు. అవును... పార్టీలు దొంగలు ఎవరు, లాయలిస్టులు ఎవరు అని కనిపెట్టలేకపోయారు. అలాంటి నిర్లక్ష్యం జరిగినపుడే పార్టీలు ఓడిపోతాయి. టీడీపీకీ అదే జరిగింది.

ఓటమితో తర్వాత తీవ్ర వేదనకు గురయిన చంద్రబాబు త్వరగా కోలుకుని శరవేగంగా స్పందిస్తున్నారు. పరిపాలన వదిలేసి టీడీపీని టార్గెట్ చేస్తున్న జగన్ ను ఓ పట్టు పట్టాలని నిర్ణయించారు. తండ్రీ కొడుకులు ఇద్దరు తమ శక్తిమేరకు జగన్ అసమర్థతను జనానికి చాటిచెబుతున్నారు. పార్టీని మరింత దృఢంగా మార్చడానికి పార్టీ నిర్మాణాన్ని కొత్తరూపులోకి తేవాలని చంద్రబాబు గతంలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక నుంచి పార్టీ జిల్లా విభాగాల వారిగా కాకుండా పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా కమిటీలను ఏర్పాటుచేసి పార్టీని అన్ని దశల్లో బలోపేతం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. 

దీనివల్ల రెండు లాభాలు. ముందు నుంచే పార్లమెంటరీ స్థాయిలో క్యాడర్ పనిచేస్తూ పోవడం వల్ల భవిష్యత్తుల్లో ఎంపీ సీట్లను గెలవడం సులువు అవుతుంది. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల సమన్వయం బాగుంటుంది. 13 విభాగాలు కాస్త 25 అయ్యి పని నిర్మాణాత్మకంగా జరిగే అవకాశం ఉంటుంది. జగన్ తాను ఎన్నికల ముందు చెప్పినట్లు పార్లమెంటు కేంద్రాల ఆధారంగా అవన్నీ జిల్లాలుగా మారితే... పార్టీని నడపడం కూడా సులువు అవుతుంది. అపుడు మళ్లీ ఈ కమిటీలు జిల్లా కమిటీలుగా మారిపోతాయి. 

కమిటీల మార్పులన్నీ దసరా నుంచి చంద్రబాబు మొదలుపెడుతున్నారు. గతంలో పార్టీ పదవులను కాలపరిమితి దాటేవరకు ఉంచేవారు. ఇక నుంచి పనివిధానం, ఫలితాల ఆధారంగా ఎప్పకపుడు కొనసాగించడం, తీయడం జరుగుతుంది. మొత్తానికి పార్టీని పూర్తిగా ఏకతాటిపై నడిపించాలని చంద్రబాబు గట్టిగా డిసైడ్ అయినట్టున్నారు.