టీడీపీ కొత్త ఐడియా - జగన్ పై ఢిల్లీలో రచ్చ

August 15, 2020

తెలుగుదేశం పార్టీ నెంబరు తక్కువగా ఉన్నా అధికార పార్టీకి చుక్కలు చూపిస్తోంది. జూమ్ యాప్ అనేది బాబుకి ఎందుకు దొరికిందిరా అన్నట్టు వైసీపీ నేతలు తలపట్టుకునే పరిస్థితి. వారి ప్రస్ట్రేషన్ డైరెక్టుగా ఆ జూమ్ తీసేస్తే సరిపోతుంది అంటూ మీడియా ముందు వెళ్లగక్కారు. వారిపై బాబు ఒత్తిడి ఏ స్థాయిలో పనిచేస్తే అలా అని ఉంటారు? మొండివాడు రాజుకంటే గొప్పోడు. ఇక్కడ రాజే ఎవరి మాట వినని మొండివాడు. అందుకే ఒకటి రెండు రకాలుగా యుద్ధం చాలదు అని తెలుగుదేశం పార్టీ అన్ని మార్గాల్లో తన పోరాటాలు చేస్తోంది. తాజాగా జగన్ పై ఫిర్యాదు చేయడానికి ఢిల్లీకి వెళ్లింది.

ఏపీలో నేరుగా పోరాటం, కార్యకర్తల ద్వారా అధికార పార్టీ అవినీతిని ఎక్కడికక్కడ బయటపెట్టడం, నేతలు, మంత్రులు చేసే తప్పులను, కబ్జాలను, దాడులను బయటపెట్టడం వంటివన్నీ చేస్తోంది. ఇపుడు కొత్తగా జాతీయ స్థాయిలో జగన్ ప్రభుత్వ చర్యలను ప్రచారం అయ్యేలా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కి ఫిర్యాదు చేసే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ ఎంపీలకు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికింది.

వారు ఫిర్యాదు చేసే అంశాల జాబితే ఇదే.

 • ప్రాథమిక హక్కులు కాలరాయడం, 
 • భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, 
 • రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, 
 • రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు 
 • హింసా విధ్వంసాలు, 
 • ఇళ్ల కూల్చివేత, 
 • ఆస్తుల ధ్వంసం, 
 • భూములు లాక్కోవడం, 
 • తోటల నరికివేత, 
 • బోర్ వెల్స్ ధ్వంసం, 
 • బీసీ, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాలు 
 • ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, 
 • సోషల్ మీడియా ఆధారంగా కార్యకర్తలపై అక్రమ కేసులు, 
 • దళితులపై అమానుషాలు, దాడులు
 • మానవ హక్కుల ఉల్లంఘనలు 

వీటన్నింటిపై సాక్ష్యాధారాలతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి టీడీపీ ఎంపీలు తీసుకెళ్తారు. రాష్ట్రపతిని కలిసేవారు  ముగ్గురు లోక్ సభ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు,  రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. వీరితో పాటు పలువురు ఇతర ముఖ్య నేతలు వెళ్లనున్నారు.