పంచాయతీ ఎన్నికల టీడీపీ సాంగ్... వైరల్

June 03, 2020

జగన్ అరాచకాలను, ఆయన పాలన అసమర్థతలను ఆర్ద్రతతో చెప్పడానికి పాటనే ఆయుధంగా ఎంచుకుంది తెలుగుదేశం పార్టీ. పంచాయతీ ఎన్నికలకు ప్రజలను చైతన్య పరిచేలా రూపొందించిన ఈ పాటను ఇపుడే విడుదల చేశారు. వెంటనే అది వైరల్ అవుతోంది. రాష్ట్రంలో పాత పాలనకు, జగన్ పాలనకు మధ్య తేడాను వివరిస్తూ సాగిన పాటలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వ బాధితుల వేదలను హృద్యంగా ఆవిష్కరించింది ఈ పాట.