అధికారంలో ఉన్నపుడు రావల్సిన ఆలోచన ఇపుడొచ్చింది

December 12, 2019

మనం చేసిన మంచి జనాలకు తెలిస్తే... జనాలు మెచ్చుకోవచ్చు. మెచ్చుకోకపోవచ్చు. 

కానీ మనంపై జరుగుతున్న దుష్ర్పచారాన్ని అడ్డుకోకపోతే ప్రతి ఒక్కరికి దూరమైపోతాం.

ఇది... తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు గుర్తించని లాజిక్. ఈ ఒక్క తప్పు పార్టీని పాతాళానికి తొక్కేసింది. ప్రజల బాత్రూం నుంచి బెడ్ రూం వరకు ఎక్కడా మొబైల్ విడచి ఉండటం లేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆ తరాన్ని నమ్ముకోకుండా తనకున్నంత మీడియా బలం వైకాపాకు లేదు అని తనకు తాను భ్రమలో బతికింది. రేపు పొద్దున ఎపుడో వచ్చే నిజం ఎవరికి కావాలి, ఈరోజు చేతిలో కళ్లెదుట ఆకర్షించే అందమైన అబద్ధం కనిపిస్తుంటే. ఇదే వైకాపా సక్సెస్. టీడీపీ ఫెయిల్యూర్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వైకాపా, టీఆర్ఎస్ కార్యకర్తలు చంద్రబాబును తిట్టని తిట్టు లేదు. చంద్రబాబు గురించి చెప్పని అబద్ధం లేదు. కానీ అధికారంలో ఉన్న పార్టీని ఇంత ధైర్యంగా తిడుతున్నా, వ్యక్తిగత పరువుకు భంగం కలిగిస్తున్నా తెలుగుదేశం ప్రముఖులు అస్సలు పట్టించుకోలేదు. వారు తిడితే మాదేం పోతుంది అనుకున్నారు. కానీ పోయిందంతా దాని వల్లే.

విజయసాయిరెడ్డి మొదట తన ట్విట్టరులో ఒక అబద్ధం చెబుతారు. ఆ చెప్పే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ స్థాయి వ్యక్తి రాతపూర్వకంగా చెప్పారు అంటే అది నిజమై ఉంటుంది కదా అని ఆయన కార్యకర్తల శ్రేణి దానిని తీసుకెళ్లి విస్తృత ప్రచారం చేసేవారు. కానీ ఏ అబద్ధంపైన టీడీపీ పరువు నష్టం దావా వేయలేదు. కోర్టుకు వెళ్లలేదు, మరి ఏం పట్టించుకోకపోతే ఊరికే ఉంటాడా? మళ్లీ మళ్లీ అబద్ధం చెప్పడం మొదలుపెట్టారు. అలా రాష్ట్ర ప్రజల్లో చంద్రబాబు పనులను, అభివృద్ధిని అబద్ధమని నమ్మించడంలో వైసీపీ వంద శాతం సక్సెస్ అయ్యింది. దీనిని మొగ్గలోనే అడ్డుకుని ఉంటే టీడీపీకి ఇంత డ్యామేజ్ కచ్చితంగా జరిగేది కాదు. చివరకు ఈరోజు కృష్ణా జిల్లాకు తొలకరి కంటే ముందే నీరు అందిస్తున్న పట్టిసీమ కూడా చంద్రబాబు తప్పు కింద ప్రచారం చేయడంలో వైసీపీ వంద శాతం సక్సెస్ అయ్యింది. అదేంటో గాని పట్టిసీమ నిర్మించిన కంపెనీ కూడా వైసీపీ మీదా దావా వేయకపోవడం చాలా విచిత్రంగా అనిపిస్తుంది.

సరే ఇదంతా ఇపుడు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. చేతులు కాలాక తెలుగుదేశం పార్టీ నేతలు ఆకులు పట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్నపుడు దుష్ర్పచారాలను అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైన పార్టీ ఇపుడు కళ్లు తెరిచి అసత్యాలను, మార్ఫింగ్ లను అడ్డుకోవడానికి లీగల్ సెల్ ఏర్పాటుచేసింది. సోషల్ మీడియాను విపరీతంగా వాడుతోంది. పోగొట్టుకున్న చోట వెతకడానికి ప్రయత్నం చేస్తోంది. 

ఈ సందర్భంగా... సోషల్ మీడియా ద్వారా పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రత్యేక సందేశం పంపారు.

‘‘​వైసీపీ అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపైనే కాకుండా, తెదేపాకు ఓటేసిన సామాన్యులపై కూడా కక్షసాధింపు చర్యలకు దిగి వేధిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. కార్యకర్తలపై వంద చోట్ల దాడులు చేశారు. ఆరుగురిని అత్యంత దారుణంగా హత్యచేశారు. ఈ దారుణాలు, దౌర్జన్యాలపై ఇక సహించేది లేదని కార్యకర్తలకు అండగా నిలిచి పోరాటం చేయాల్సిందేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్ణయించారు. కార్యకర్తల రక్షణ కోసం ప్రత్యేక సెల్ ఏరాటుచేశారు. వైకాపా వర్గీయులు దాడులు చేసినా, బెదిరించినా ఆ స‌మాచారాన్ని, టీడీపీ ప్ర‌త్యేక విభాగం నెంబ‌ర్‌