అపుడు బాబును తిట్టాడు, కానీ ఇపుడు బాబే మేలంటున్నాడు !!

August 07, 2020

అయినదానికీ కానిదానికీ తరచూ చంద్రబాబు పై విమర్శలు చేసిన బీజేపీ నేత సోము వీర్రాజుకు జ్జానోదయం అయ్యింది. ఎవరు ఏం రాసినా కనీసం అది నిజమా కాదా అని చూడకుండా బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై పదేపదే విమర్శలు చేసేవారు. పొత్తులో ఉన్నపుడు కావాలనే టీడీపీని రెచ్చగొట్టి బీజేపీ పెద్దలతో కొట్లాట పెట్టారు జీవీఎల్ వంటి వారు. తాజాగా వారిలో చాలా మందికి జ్జానోదయం అవుతోంది. తాజాగా సోము వీర్రాజు మాట్లాడుతూ జగన్ అవినీతి కంటే బాబు పాలన నయం అని కొనియాడుతున్నారు.

చంద్రబాబు హయాంలో ఇసుక కేవలం 5 వేలకే దొరికేదని చెప్పిన సోము వీర్రాజు ఇపుడు అదే ఇసుక 20 వేలు అయ్యిందని... ఈ సొమ్మంతా ఎవరు తింటున్నారని ప్రశ్నించారు. ఇంత భారీ అవినీతి వల్ల నిర్మాణ రంగం నాశనం అయ్యిందన్నారు. కూలీలకు ఉపాధి పోయిందన్నారు. కోటిన్నర మంది ఆధారపడిన రంగంలో జగన్ చేసిన ఇసుక ప్రయోగాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని సోము వీర్రాజు విమర్శించారు.

ఇదొక్కటే కాదు... ఇళ్ల స్థలాలలో అవినీతి జరుగుతోంది అని జగన్ సర్కారుపై బీజేపీ నేత సోము వీర్రాజు విరుచుకుపడ్డారు. 

తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ ఆవ భూముల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని, తెనాలి, ఆదోని వంటి చోట్ల కూడా ఇదే తరహా అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. తెలుగుదేశం హయాంలో అవినీతి జరిగిందని అపుడు జగన్ అన్నారు. అవినీతి నిజమయితే ఇప్పటివరకు ఎందుకు చంద్రబాబుపై చర్యలు తీసుకోలేదని జగన్ ను సోము నిలదీశారు. అది విచారణ మొదలుపెడితే తన హయాంలో పట్టా మోసాలు బయటకు వస్తాయని జగన్ కి భయం అని సోము వీర్రాజు అన్నారు.

ఏది ఏమైనా... మద్యం ధరలు, నాటు సారా ప్రబలడం, ఇంగ్లిష్ మీడియం, ఇళ్ల పట్టాలు, మండలిరద్దు, ఇసుక దందా... ఇవన్నీ బీజేపీ నేతలకు చుక్కలు చూపిస్తున్నాయి. బాబు పాలన ఎందుకు బెటరో వారికి జ్జానోదయం అయ్యింది.