అయ్యన్న వార్నింగ్ - మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు, పోలీసులారా జాగ్రత్త

July 05, 2020


నర్సీపట్నం తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు ఏపీ పోలీసులకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు ముఖ్యమంత్రి చెప్పినదానికల్లా తలూపకండి. అన్యాయాలకు అండగా ఉండకండి. జాగ్రత్తగా ఉండండి, న్యాయంగా ఉండండి. మరో మూడేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి. మీరు మళ్లీ మా వద్ద పనిచేయాల్సి ఉంటుంది అంటూ అయ్యన్నపాత్రుడు పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. జగన్ పాలన వల్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులపై అయ్యన్న తెలుగుదేశం ఆధ్వర్యంలో బైకు ర్యాలీకి పిలుపునిచ్చారు. హెల్మెట్లు లేని కారణంగా పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు.

దీంతో ఆగ్రహించిన అయ్యన్న మాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదు. మేము చేస్తున్నది అన్యాయంపై నిరసన. పోలీసులు న్యాయంగా వ్యవహరించకపోతే మళ్లీ ఇబ్బందులు తప్పవు. ఈసారి ఎన్నికలు 3 ఏళ్లలోపే వస్తున్నాయి అని పోలీసులను హెచ్చరించారు. అయ్యన్న వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.ఇటీవల తెలుగుదేశం అడుగులు కాంగ్రెస్ కు దూరంగా పడుతున్నాయి.

రాష్ట్రంలో జగన్ వ్యవహారశైలి కూడా బీజేపీకి ఏమీ నచ్చడం లేదు. ఈ నేపథ్యంలో జగన్ వ్యవహారంపై తెలుగుదేశం, బీజేపీ విడివిడగా పోరాడుతున్నాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా జీడీపీ స్లో డౌన్ అయిన నేపథ్యంలో పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన ఏపీలో జగన్ తీరుతో ఆర్థిక వృద్ధిపై కొంత ప్రభావం పడింది. ఏ విధంగా చూసినా జగన్ కి బీజేపీ అవసరం ఉంది గాని, బీజేపీకి జగన్ అవసరం లేదు. ఈ నేపథ్యంలో అసలు జగన్ మనకు అవసరమా ? అన్న కోణంలో బీజేపీ వ్యవహరిస్తోంది. మరోవైపు తెలుగుదేశం కూడా తెలుగుదేశంపై పోరాటాన్ని ఉదృతం చేసింది. జమిలి ఎన్నికలు రానున్న నేపథ్యంలో అంత వేగంగా జగన్ తనను పాలనలో నిరూపించుకోలేడు. ఇవన్నీ పేర్చి చూస్తుంటే... అయ్యన్నతో పాటు తెలుగుదేశం నేతల్లో చాలా కాన్ఫిడెన్సు కనిపిస్తోంది.