రాజకీయంలో ఇది జగనిజం... !!

August 14, 2020

ఎన్టీఆర్

చంద్రబాబు

వైఎస్

రోశయ్య

కిరణ్ 

జగన్...

అందరు ముఖ్యమంత్రులు ఒకేలా ఉండరు. కానీ అందరు అధిరోహించిన పదవి సేమ్. పదవిలో ఉన్నపుడు  ఆలోచనలకు తగ్గట్టు వారు తమ పదవిని వాడుకుంటారు. తండ్రి సీఎం అవడానికి ముందు ఒక్క వ్యాపారం లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తండ్రి దిగిపోయేలోపు వేల కోట్లు ప్రభుత్వానికి ట్యాక్స్ ఎలా కట్టగలిగారు.

అంతకుముందు ఎన్నో వందల మంది వేర్వేరు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ ఏ సీఎం కొడుకు జగన్ లా ఎదగలేదు. అంత వ్యూహాత్మక అడుగులు వేసే జగన్ ను చంద్రబాబు చాలా తక్కువ అంచనా వేశారు. అతను గెలుస్తాడని అనుకోలేదు. అసలు అతను తనకు పోటీయే కాదనుకున్నాడు.

వాస్తవానికి పాజిటివ్ నెగటివ్ రెండూ చూడాలి. కానీ బాబు తాను గెలుస్తాను అంతే అని కూర్చున్నారు. కానీ జగన్ గెలిస్తే... అతను వేసే అడుగులు ఎలా ఉంటాయని ఊహించలేదు. శత్రువును తక్కువ అంచనా వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. 

ఇపుడు చట్టంలోని లోపాలను తన బలాలుగా మార్చుకుని తెలుగుదేశం పార్టీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు జగన్. 40 సంవత్సరాల అనుభవంతో చంద్రబాబు ఈ గడ్డు కాలాన్ని ఎలా ఎదుర్కొంటారు? అన్నది కాలమే చెబుతుంది. ఈ సంక్షోభం పార్టీని నాశనం చేస్తుందా? మరింత బలంగా మారడానికి అవకాశంగా మారుతుందా? అన్నది చూడాలి. 

అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. 

చింతమనేనిని అరెస్టు చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేశారు.

వీళ్లని అరెస్టు చేయడం అంటే నేరాన్ని నిరూపించినట్టు కాదు. నిరూపణ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కానీ నిందలతో కూడా మనిషిని జైల్లో పెట్టొచ్చు అన్న అవకాశాన్ని జగన్ వాడుకుంటున్నాడు. టీడీపీని ఇబ్బంది పెడుతున్నారు.

ఇదొక టైపు రాజకీయం. అయితే, ఇది ప్రమాదకరమైన రాజకీయం. భవిష్యత్తులో జగన్ దిగిపోయి టీడీపీ అధికారంలోకి వస్తే అపుడు జగన్ కూడా ఇదే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 

అవినీతి అరికట్టాలనుకుంటే దానిని సదుద్దేశంతో చేయాలి గాని తనకు నచ్చని వారి జైల్లో పెడితే చాలు ఇగో శాటిస్ ఫై అవుతుంది అనుకుంటే భవిష్యత్తులో అన్నిటికీ రెడీగా ఉండాల్సి వస్తుంది.