బాబుతో సహా అందరినీ గృహ నిర్బంధం

September 18, 2019

ఛలో ఆత్మకూరు పిలుపు నేపథ్యంలో ఏపీ పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నేతలను వారి వారి ఇళ్లలోనే నిర్బంధించారు. బయటకు వచ్చిన వారిని పోలీసు స్టేషన్లకు బలవంతంగా తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీనికి నిరసనగా టీడీపీ శ్రేణులు ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగాయి. సీఎం జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరావతి, గుంటూరు, విజయవాడ నగరాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు నిరసనలు, ధర్నాలకు దిగాయి. #YSJaganFailedCM, #ChaloAtmakur జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దాడులు కంటే హోంమంత్రి వ్యాఖ్యలే తమను ఎక్కువగా బాధించాయని... వైసీపీ ప్రభుత్వ బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 

 గ్యాలరీ స్లైడ్ షో కింద చూడొచ్చు.

RELATED ARTICLES

  • No related artciles found