హాట్ కామెంట్ - టీడీపీని వదిలిన అవినీతి చీడ

July 04, 2020

తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తలు. దేశంలోనే అత్యంత సమర్థవంతమైన నెట్ వర్క్ ఉన్న పార్టీగా తెలుగుదేశం పార్టీని ఎంతో మంది పేర్కొన్నారు. అందుకే 85 శాతం సీట్లతో ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కూడా 40 శాతం రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపు నిలబడ్డారు. ఈరోజు పార్టీని వీడిన నలుగురు ఎంపీలు తెలుగుదేశం పార్టీకి నలుగురు కార్యకర్తలతో కూడా సమానం కాదు. ఎందుకంటే కార్యకర్తలు పార్టీని మోస్తే... ఈ నలుగురు పార్టీపై ఆధారపడ్డారు.
ఇంకా చెప్పాలంటే... పార్టీ ఈ నలుగురి వల్ల ప్రజల్లో డ్యామేజ్ అయ్యింది. అవినీతి నేతలను భరిస్తోందన్న ముద్ర వేసుకుంది. పార్టీ మారిన నలుగురులో ముగ్గురిపై విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వారిని వెనకేసుకురాలేక టీడీపీ తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యింది. చంద్రబాబు కూడా వీళ్ల వల్ల పార్టీకి ఇంత తలనొప్పి అవసరమా అని ఫీలయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేవలం పార్టీకి కొంచెం ఆర్థిక అండ తప్పించి ఏ విధంగా పార్టీకి వీరి వల్ల ఉపయోగం లేదు. అయితే, వారి వల్ల పార్టీకి కలిగే మేలు కంటే కూడా డ్యామేజ్ చాలా ఎక్కువ. ఎన్నికల సమయంలో ఇది పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. కొన్ని సందర్భాల్లో ఎందుకు ఇలాంటి వారు టీడీపీకి అని అభిమానులు కూడా ఫీలయిన సందర్భాలున్నాయి.
అయితే, ఆ నలుగురు టీడీపీని వదిలిన అవినీత చీడ అని ఇపుడు పార్టీ మారడంతో అవినీతి బీజేపీలో అవినీతి నేతలు చేరడంతో మా పార్టీ ప్రక్షాళన అయ్యిందని కామెంట్ చేస్తున్నారు తెలుగుదేశం అభిమానులు.
నిజానికి అభిమానుల ఆలోచన కరెక్టే. ఈ కామెంట్ కు మంచి లైకులు పడుతున్నాయి. నెట్లో ఇది హాట్ కామెంట్ గా వైరల్ అవుతోంది.