చంద్రబాబు... వేసిన తెలివైన అడుగు ఇది

August 05, 2020
CTYPE html>
మే అంటే మహానాడు. తెలుగుదేశం పార్టీ పండగ. పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకునే కార్యక్రమం. మిగతా వారు దీనిని ప్లీనరీ అంటారు. తెలుగుదేశం మహానాడు అని పేరు పెట్టుకుంది.
ఎన్టీఆర్ జయంతినే పురస్కరించుకుని 27, 28 తేదీలో ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈసారి మహానాడు వాయిదా వేస్తారు అనుకున్నారు. గతంలో వాయిదా వేసిన సందర్భాలున్నాయి. టీడీపీ శ్రేణులు అవి దృష్టిలో పెట్టుకుని వాయిదా వేస్తారనుకున్నాయి. వేస్తేనే మంచిదని కూడా అనుకున్నాయి.
ఇక్కడే చంద్రబాబు వ్యూహాత్మక అడుగు వేశారు. మిగతా మహానాడులకంటే ఇది చాలా కీలకం కానుంది. పార్టీ ఏడాదిలో ఎంతో ఆత్మవిమర్శ చేసుకుంది.
జగన్ ఏడాది పాలనలో పూర్తిగా విఫలమవడం, ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉండటం ఒక కారణం అయితే... ఈ సమయంలో కార్యకర్తలుక పార్టీ అండగా ఉందన్న భరోసా, పార్టీ చాలా యాక్టివ్ గా ఉందన్న సంకేతాలు ఇవ్వడం అవసరం. మంచి భవిష్యత్తు ఉంది. జగన్ ప్రభుత్వం పూర్తిగా  ప్రజల మద్దతును కోల్పోయింది అని... సరైన దారిలో పయనిస్తే మనకు మంచి ఫలితాలు గ్యారంటీగా దక్కుతాయని పార్టీ శ్రేణులను గైడ్ చేయడానికి ఇది సరైన సమయం.
పైగా ఇపుడు పార్టీ యుద్ధాలు, ఎత్తులు పై ఎత్తులు సోషల్ మీడియా వేదికగా బలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీకి మనం దగ్గరగా ఉండాలన్న విషయాన్ని శ్రేణులకు బలంగా తెలియజేయడానికి జూమ్ ద్వారా మహానాడు నిర్వహిస్తోంది పార్టీ.
ఇక ఈ ఏడాది 14000 మంది జూమ్ యాప్ ద్వారా మహానాడులో పాల్గొంటున్నారు. ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 27, 28 తేదీల్లో లఅంటే రేపు ఎల్లుండి మహానాడు జరగనుంది. ఇందులో పార్టీ అధ్యక్షుడిని కూడా ఎన్నుకుంటారు.
 
 Image 
 ఒక తెలుగుదేశం అభిమాని పార్టీ రంగులు, గుర్తులతో కట్టుకున్న ఇల్లు.