దేశంలో ఈ పనిచేసిన తొలి పార్టీ TDP  

August 14, 2020
CTYPE html>
మహానాడు : హైటెక్ పార్టీ అయిన టీడీపీ దేశంలో తొలిసారిగా తన పార్టీ ప్రధానమైన ప్రత్యేక కార్యక్రమాన్ని టెక్నాలజీ ఆధారంగా నిర్వహిస్తోంది. కరోనా నేపథ్యంలో మహానాడును రద్దు చేస్తారని అందరూ అనుకుంటే చంద్రబాబు దానికి భిన్నంగా నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచారు.
దేశంలో పార్టీ కోసం టెక్నాలజీని సమర్థంగా వాడుకున్న తొలి పార్టీ తెలుగుదేశం. టెక్నాలజీ ద్వారానే పార్టీ కార్యకర్తల డేటాబేస్ ను కచ్చితత్వంతో సమగ్రంగా నిర్వహించగలిగింది. దీనిద్వారా పార్టీ కార్యకర్తలకు భీమా సదుపాయం కల్పించగలిగింది. ఇపుడు అదే టెక్నాలజీని మరోసారి పెద్ద స్థాయిలో వాడనుంది.
మే 27, 28న టీడీపీ మహానాడును నిర్వహించాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. జూమ్ యాప్ ద్వారా ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న తొలి పార్టీ తెలుగుదేశమే. 14 వేల మంది పాల్గొనేలా ప్రణాళికలు రూపొందించారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సంస్థాగత అంశాలతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రత్యేక హోదా, విభజన చట్టం అంశాలపై మహానాడులో చర్చించనున్నారు.