ఆ ముగ్గురితో చంద్రబాబు సడెన్ మీటింగ్

July 03, 2020

ఏపీలోని 25 పార్లమెంటు నియోకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ముగ్గురు ఎంపీలు ఈరోజు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ ముగ్గురిలో ఒకరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని గత వారంలో పార్టీ పరువును బజారుకీడ్చిన విషయం తెలిసిందే. మునుపు ఎన్నడూ లేనట్టు చంద్రబాబుకు బహిరంగ అల్టిమేటం జారీ చేశారు. అయితే, అనంతరం ఆ వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపిస్తోంది.

అయితే, తాజాగా ఈ ముగ్గురు చంద్రబాబుతో సమావేశం కావడం ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది. కేశినాని నానితో మాట్లాడటానికే చంద్రబాబు ఈ సమావేశం ఏర్పాటుచేశారని అర్థమవుతోంది. ఎలాగూ ఇద్దరు పక్కనే అందుబాటులో ఉంటారు. మరొకరు కొంచెం దూరంగా ఉండే రామ్మోహన్ నాయుడు. ఎలాగూ గెలిచాక ముగ్గురితో ప్రత్యేకంగా కలవలేదు. పైగా రాజ్యసభ సభ్యుల్లో జరిగిన మార్పు తర్వాత కూడా చంద్రబాబు ఎంపీలతో మాత్రమే ప్రత్యేకంగా సమావేశం కాలేదు. ఇలా అన్ని సమస్యలు విషయాలు ఉమ్మడిగా చర్చించడానికి ప్రత్యేక కాస్త విరామంతో చంద్రబాబు వారితో సమావేశం అయినట్టు తెలుస్తోంది.