టీడీపీ ఆఫీసును కూల్చేయండి !!

July 05, 2020

అవును, అమరావతిలో కొత్తగా కట్టిన టీడీపీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో పిటిషను వేశారు. గుంటూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ ఆఫీసును నిర్మించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు సొంత పార్టీకి ఈ స్థలాన్ని లీజుకు ఇచ్చారని.. అయితే, వాగులు, వంకలు, చెరువులు, నదీ పరివాహక ప్రాంతాల భూములను  ఇతర అవసరాలకు కేటాయించడం పర్యావరణ చట్టాల ప్రకారం తప్పు అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందన్నారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడినందున ఆఫీసును కూల్చేసి భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వమని ఆళ్ల కోరారు. 

టీడీపీ ఆఫీసు సుమారు 4 ఎకరాల్లో నిర్మించారు. 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దీనిని టీడీపీ ఆఫీసు కు కేటాయించారు. దీనిని కూల్చేసి టీడీపీని దెబ్బకొట్టాలని వైసీపీ నేతలు కంకణం కట్టుకున్నారు. ఈ ఆఫీసును తాజాగా ప్రారంభించారు. అతిత్వరలో కార్యకలాపాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవుతాయి. మరి దీనిని కోర్టు విచారిస్తుందా? లేదా? విచారిస్తే కూల్చివేస్తుందా? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.