తారక్‌కు టీడీపీ సపోర్ట్... ఏం జరిగిందంటే ?

August 07, 2020

జూనియర్ ఎన్టీఆర్‌కు తెలుగుదేశం పార్టీతో కొన్నేళ్లుగా సరైన సంబంధాలు లేవు. 2009 ఎన్నికల్లో తారక్‌తో ప్రచారం చేయించినపుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అతడితో చాలా సన్నిహితంగా ఉన్నాడు. ఐతే ఆ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాబట్టేలకపోవడంతో ఎవరికి వారే సైలెంటయ్యారు. న్టీఆర్ కూడా పార్టీకి దూరం దూరంగానే ఉంటూ వచ్చాడు. మధ్యలో తారక్ మీద తెలుగుదేశం వాళ్లు వ్యతిరేక ప్రచారాలు కూడా చేసినట్లు ఆరోపణలు వినిపించాయి. బట్ వాటిని తారక్ కొన్ని సార్లు కొట్టిపారేశారు.

‘బాద్ షా’ సినిమా సమయంలో టీడీపీకి, తారక్‌కు మధ్య అంతరం మరింత పెరిగినట్లే కనిపించింది. గత ఏడాది ఎన్నికల్లో అసలు తారక్ పేరే ఎక్కడా వినిపించలేదు. ఐతే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవం పాలయ్యాక మాత్రం తారక్ పేరు ప్రముఖంగా చర్చలోకి వచ్చింది.

తెలుగుదేశం పార్టీని తారక్‌కు అప్పగించాలని.. అతనే పార్టీ భవిష్యత్తు అని గట్టిగా డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే బుధవారం తారక్ పుట్టిన రోజు నేపథ్యంలో తెలుగుదేశం అభిమానుల నుంచి తారక్ పట్ల పూర్తి సానుకూలత కనిపించింది. అతడికి టీడీపీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పారు. అతడికి ఓ రేంజిలో ఎలివేషన్లు ఇచ్చారు.

చంద్రబాబు తమ్ముడి కొడుకు నారా రోహిత్.. తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతోనే తెలుగుదేశం అభిమానుల్లో ఒక ఉత్సాహం వచ్చింది. ఆ తర్వాత పార్టీ ఫ్యాన్స్ అందరూ పెద్ద ఎత్తున తారక్‌కు శుభాకాంక్షలు చెప్పారు. బర్త్ డే ట్రెండ్స్‌లోనే తెలుగుదేశం ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం వర్గాల్లో మాత్రం తారక్ పట్ల సానుకూల అభిప్రాయం ఉందని.. పార్టీలోకి అతడి రాక కోసం ఎదురు చూస్తున్నారని బుధవారం సోషల్ మీడియా ట్రెండ్స్‌ను బట్టి స్పష్టమైంది.