వైసీపీ అబద్ధాలపై చెలరేగిపోయిన టీడీపీ

April 04, 2020
CTYPE html>
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు సుధీర్ఘ కాలం పాటు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్ ఇంటిపై ఇటీవల ఐటీ శాఖ దాడులు, ఆ తర్వాత సదరు దాడులపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విడుదల చేసిన పత్రికా ప్రకటనలు ఏపీలో పెను సంచలనమే రేపాయి. సీబీడీటీ పేర్కొన్నట్లుగా పెండ్యాలతో పాటు టీడీపీకి చెందిన పలువురు నేతల ఇల్లు, కార్యాలయాలపై జరిగిన దాడుల్లో రూ.2 వేల కోట్లకు పైగా అక్రమాలు వెలుగు చూశాయని, అవన్నీ కూడా చంద్రబాబుకు దొడ్డిదారిన లబ్ధి చేకూర్చినవేనంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం వెలుగు చూసిన ఐటీ పంచనామా నివేదిక టీడీపీకి మంచి అస్త్రంగానే మారిందని చెప్పాలి. ఈ నివేదికను ఆసరా చేసుకుని ఎంట్రీ ఇచ్చిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు వైసీపీ నేతలపై ఓ రేంజిలో విరుచుకుపడ్డారు.  చంద్రబాబు అవినీతి బయటపడిందంటూ వైసీపీ చేస్తున్న ప్రచారమంతా దుష్ప్రచారమేనని ఆయన విరుచుకుపడ్డారు.పెండ్యాల ఇంటిలో ఐటీ అధికారులు సుదీర్ఘంగా దాడులు చేశారు. 6వ తేదీ నుంచి 9వ తేదీ దాకా నాన్ స్టాప్ గా సోదాలు చేసిన అదికారులు సోదాలు ముగిసిన సందర్బంగా ఓ పంచనామా రిపోర్ట్ రాసి దానిపై పెండ్యాల సంతకాలు తీసుకుని మరీ వెళ్లిపోయారు. సదరు పంచనామా నివేదిక బయటకు రావడంతో అప్పటిదాకా సైలెంట్ గా ఉన్న నేతలు... ఆ తర్వాత తమదైన శైలిలో ఎదురు దాడి ప్రారంభించారు. పంచనామా నివేదికలో ఏమున్నదన్న విషయానికి వస్తే... పెండ్యాల ఇంటిలో రూ.2.63 లక్షల నగదు (రూ.500 డినామినినేషన్ లో)తో పాటు 12 తులాల బంగారం పట్టుబడిందట. పట్టుబడిన ఆ నగదుతో పాటు బంగారాన్ని కూడా అధికారులు పెండ్యాలకే తిరిగిచ్చేసి వెళ్లిపోయారు. దీనిని ఆసరా చేసుకుని యనమల ఓ రేంజిలో ఫైరైపోయారు.పెండ్యాల ఇంటిలో పట్టుబడింది రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం అయితే... రూ,.2వేల కోట్ల అక్రమాస్తులు పట్టుబడ్డాయని వైసీపీ ఆరోపిస్తోందని యనమల ఫైర్ అయ్యారు. పెండ్యాల ఇంటిలో ఐదు రోజుల పాటు  ఐటీ సోదాలు జరిగితే ఆ ఐదు రోజుల పాటు సాక్షి పత్రిక దాడులను భూతద్దంలో పెట్టి చూపారని యనమల ఆరోపించారు. దొరికింది రూ.2 లక్షల నగదు అయితే... రూ.2వేల కోట్లు దొరికిందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ీఅంతేకాకుండా 26 డొల్ల కంపెనీలు ఉణ్నాయని వైసీపీ నేతలు ప్రచారం చేయడం అబద్దాలకు పరాకాష్ట అని యనమల ధ్వజమెత్తారు. అసలు వైసీపీ నేతలకు దమ్ముంటే... పంచనామా నివేదికపై వైసీపీ నేతలు స్పందించాలని కూడా యనమల డిమాండ్ చేశారు. అసత్య ప్రచారం చేసిన వైసీపీ నేతలు టీడీపీకి, చంద్రబాబుకు క్షమాపణలు చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.