టీడీపీ డేరింగ్... స్పీకర్ కు బ్యాడ్ మార్నింగ్ చెప్పింది

May 26, 2020
CTYPE html>
ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతున్న తెలుగు దేశం పార్టీ నిజంగానే చాలా డేరింగ్ గానే వ్యవహరించిందని చెప్పాలి. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా... రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వ్యక్తులకు ప్రత్యేకించి చట్టసభలకు సభాపతులుగా వ్యవహరిస్తున్న వ్యక్తులకు ప్రత్యేక గౌరవం ఇవ్వాల్సిందే. ఈ నిబంధనను పాటిస్తూనే వస్తున్న టీడీపీ... సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ ప్రత్యేెక సమావేశాల ప్రారంభం సందర్భంగా శాసనసభాపతిగా ఉన్న తమ్మినేని సీతారాం కు గుడ్ మార్నింగ్ కు బదులుగా బ్యాడ్ మార్నింగ్ చెప్పేసింది. ఈ తరహా చర్య నిజంగానే డేరింగ్ తో తీసుకున్నదేనని చెప్పక తప్పదు.
ఏపీ కేపిటల్ గా కొనసాగుతున్న అమరావతిని ఇకపై లెజిస్లెచర్ కేపిటల్ గా పరిమితం చేస్తూ పాలన రాజధానిగా విశాఖను, న్యాయ రాజధానిగా కర్నూలును మారుస్తూ జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఓ రేంజిలో పోరాటం సాగిస్తోంది, రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన రైతులు చేస్తున్న ఆందోళనలకు వెన్నుదన్నుగా నిలుస్తున్న టీడీపీ... మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై నిర్ణయం తీసుకునేందుకే సమావేశమవుతున్న అసెంబ్లీ సమావేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
అయితే ప్రభుత్వ నిర్ణయాలపై ఏ రేంజి వ్యతిరేకతను వ్యక్తం చేసినా... అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతే బాధ్యత కలిగిన ఓ విపక్షంగా టీడీపీ సమావేశాలకు హాజరు కావాల్సిందే కదా. ఇదే రీతిన వ్యవహరించిన టీడీపీ... అసెంబ్లీ సమావేశాలకు ముందుగా నిర్వహించే బీఏసీ సమావేశానికి హాజరైంది. తన వాదనను వినిపించింది. ఆ వెంటనే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరైంది. ఈ సందర్భంగా సభా సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకుని స్పీకర్ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్ అని చెబితే... టీడీపీ మాత్రం స్పీకర్ కు బ్యాడ్ మార్నింగ్ చెప్పేసింది. దీంతో షాక్ తన్న స్పీకర్... సంప్రదాయం ప్రకారం గుడ్ మార్నింగ్ చెబితే... బ్యాడ్ మార్నింగ్ అంటూ కామెంట్ చేయడం టీడీపీ విజ్ఝతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.