​జగన్ మందుకు చంద్రబాబు విరుగుడు

May 27, 2020
CTYPE html>
జగనన్న రాజ్యంలో చట్టం తనవాళ్లకి ఒకలా, వేరేవాళ్లకి ఒకలా పనిచేస్తుంది. గొప్ప దిశ చట్టం తెచ్చినా అంతకుముందు జరిగిన వాటిపైన, ఆ తర్వాత జరిగిన వాటిపైన ఎటువంటి చర్యలు లేవు. పబ్లిసిటీకి మాత్రం బాగా పనికొచ్చింది. తాజాగా బీసీలను దగా చేసిన ఏపీలో నిర్వహిస్తున్న ఎన్నికల్లో మందంటూ పంచితే తన పార్టీ వారు తప్ప ఎవరూ పంచకూడదు అని జగన్ డిసైడ్ అయ్యారు. అంతేకాదు బహిరంగ బెదిరింపులకు దిగారు. దీనిని ఎవరూ కాదనరు. కాదనలేరు. మందు, డబ్బు లేకుండా ప్రజాస్వామ్యం వర్దిల్లితే ప్రజలకే లాభం. 
అయితే, జగన్ ఎలాంటి వ్యక్తో ఎవరికి మాత్రం తెలియదు. అందుకే జగన్ మూడేళ్ల జైలు అనే ప్రకటన చేసిన ఉద్దేశమేంటో అర్థం చేసుకున్న చంద్రబాబు దానికి విరుగుడు తెచ్చారు. సాధారణంగా ప్రభుత్వాలు ఏర్పాటుచేసినట్లు తనపార్టీ ఆఫీసులో ఏకంగా కంట్రోల్ రూం పెడతాను ... జగన్ టీం భరతం పడతాను అని చంద్రబాబు హెచ్చరించారు. ఎలాగూ పోలీసులు అధికార పార్టీకి వంత పాడతారు... అందుకే మనం కొత్త మార్గం ఎంచుకుందాం, వైసీపీ తప్పు చేస్తే దానిని ప్రజల ముందు పెడతాం అని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇందుకోసం తెలుగుదేశం ఆఫీసులో ఒక ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు ఏ ఊర్లో ఏ వైసీపీ లీడరు డబ్బు, మద్యం పంచినా వెంటనే వాటిని ఫొటోలు తీసి తమకు పంపాలని ఒక నెంబరు ఇచ్చారు. కాల్ చేయొచ్చు. వాట్సప్ చేయొచ్చు. అంతేకాదు అవే ఫొటోలను అందుబాటులో ఉన్న మీడియాలో వెల్లడించండి అంటూ చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 
ఇది యువ నాయకులు ఎదగడానికి మంచి అవకాశం. నియోజకవర్గ నేతలు కార్యకర్తలను ప్రోత్సహించండి. ఎక్కడికక్కడ యాక్టివ్ గా పనిచేస్తూ వైసీపీ అరాచకాలను చీల్చిచెండాడుదాం అని చంద్రబాబు ఆదేశించారు. త్వరలో టోల్ ఫ్రీ నెంబరు కూడా ప్రకటిస్తాం అని చంద్రబాబు చెప్పారు.