ముంబై హీరోయిన్లు పడుకోవడానికి రెడీగా ఉంటారు- తేజస్వి

August 06, 2020

ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక మాట చెప్పాడు. కాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుంది ఆర్జీవీ అన్నాడు. అమ్మాయికి కావల్సింది ఒక వ్యక్తి వద్ద ఉన్నపుడు, ఆ వ్యక్తి అమ్మాయి నుంచి కోరుకోవాల్సింది కోరుకుంటారు. ఈ ఇచ్చిపుచ్చుకోవడాన్ని ఒక్కొక్కరు ఒక్కో స్థాయిలో ఫీలవుతారు. కొందరు తట్టుకోలేరు. కొందరు లైట్ తీసుకుంటారు. కొందరు డబ్బు, పేరు కోసం రాజీపడతారు. 

ఆర్జీవీ చెప్పింది నిజమే అన్నదానికి మరో ఉదాహరణ ఇచ్చింది నటి తేజస్వి.  తాజాగా తేజస్వి కాస్టింగ్ కౌచ్ మీద మాట్లాడింది. ముంబయి హీరోయిన్లు దేనికైనా రెడీ అంటారని చెప్పింది. కానీ మిగతా వాళ్లు దానిని అంత సులువుగా తీసుకోలేకపోతున్నారని ఆమె సంచలన కామెంట్స్ చేసింది.

సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ 90 శాతం ఉందని తేజస్వి చెప్పింది. కమిట్‌మెంట్ పేరుతో కొత్త నటులను లైంగికంగా లొంగదీసుకుంటున్నారని, కమిట్ మెంట్ కి ఓకే అన్నవారికే అవకాశాలు దక్కుతాయని చెప్పింది. తనను కూడా చాలామంది కమిట్‌మెంట్ ఇస్తావా అని అడిగినట్లు తేజస్వి వెల్లడించింది. కొత్తగా ఈ పరిశ్రమకు వచ్చే అమ్మాయిలకు ఇక్కడ ఎదురయ్యే మొదటి ప్రశ్న అదే అన్నారు. వాళ్లని  దాటి వెళ్తేనే అసలైన సినిమా వాళ్లు కనిపిస్తారన్న తేజస్వి వ్యాఖ్యానించింది

ముంబయి నుంచి హీరోయిన్ల వల్ల మన అమ్మాయిలకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ముంబయి హీరోయిన్లు దేనికైనా రెడీ అంటారు కాబట్టి వారికి వెంటనే అవకాశాలు వస్తాయన్నారు. అవకాశాలు పడక సుఖం ఇస్తేనే వస్తాయని వాళ్లు ముందే ప్రిపేరై వస్తారని తేజస్వి సంచలన వ్యాఖ్యలు చేసింది. 

ముంబై హీరోయిన్ల వల్ల తెలుగు హీరోయిన్లకు చెడ్డపేరు వస్తోందని తేజస్వి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో పలువురు హీరోయిన్లకు ఈ అనుభవాలున్నాయని, కొందరు  సిగ్గుతో నోరు విప్పరన్నారు. 

కాస్టింగ్ కౌచ్ వల్ల నా పర్సన్ లైఫ్ మిస్సయ్యాయని తేజస్వి పేర్కొంది. చెప్పింది. ఒక అబ్బాయితో డేటింగ్ చేశాను... కానీ అది బ్రేక్ అయ్యింది. అతడిని పెళ్లాడాలని అనుకున్నాక కాస్టింగ్ కౌచ్ వల్ల ఆ రిలేషన్ షిప్ నాశనం అయ్యిందన్నారు.

Recent Gallery :

Tejaswi Madivada : రసిక ఫోజులు