లండన్ లో తెలంగాణ  విలీన  దినోత్సవం

August 06, 2020

తెలంగాణ  ఎన్నారై ఫోరమ్ ఆధ్వర్యం లో  ఈ రోజు తెలంగాణ విలీన దినోత్సవాన్ని  ఘనం గ నిర్వహించారు.

ఇండియన్ యూనియన్ లో హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంపెర్ 17 న  విలీనం చెంది పూర్తి స్వేచ్ఛ వాయువు పీల్చిన రోజు  విలీన దినోత్సవ సంభారాలని  లండన్ లో గత 10 ఏండ్లు  గా జరుపుతున్నట్లు  ఫౌండర్,చైర్మన్ గంప వేణుగోపాల్ తెలిపారు


సెప్టెంపెర్ 17 రోజు  జరుపుకోవడం  స్వాతంత్ర సమరయోధులని స్మరించుకోవడం నేటితరం బాధ్యత అని ముఖ్య అతిధి గ పాల్గొన్నా మాజీ   AP  HOUSEFED  చైర్మన్ ,టీపీసీసీ కార్యదర్శి  బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి  అన్నారు .


ప్రధాన కార్యదర్శి సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ     ప్రతి ఏటా  సెప్టెంపెర్ 17 జరిపి స్వతంత్ర సమరయోధులని ,సాయుధ పోరాట యోధులని  యాది చేసుకోవడం  వారి చరిత్ర ని భావి భారత పౌరులకు తెలపడం బాధ్యతో ప్రతి ఒక్కరు చేయాలనీ అన్నారు.

కార్యక్రమం లో   స్వాతంత్ర సమరయోధుల,సాయుధ పోరాట యోధుల చిత్ర పటాలకు పుష్పగుచ్చాలు సమర్పించి ,  నాటి ఘటనల పై ఉపన్యాసాలు ఇచ్చారు  

ఈ కార్యక్రమం లో  కార్యదర్శి రంగు వెంకటేశ్వర్లు ,మహేష్ జమ్ముల ,కమిటీ సభ్యులు  నల్ల నర్సింహా రెడ్డి ,చట్ల  మహేష్ ,నరేంద్ర వర్మ ,మేడిశెట్టి అశోక్ , బొలిశెట్టి దశరథ్ ,మంగళరపు శ్రీధర్ , మారుతి ,కొయ్యడ రాజు లు పాల్గొన్నారు.